More

    రజతం కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ

    అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్, నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించాడు నీరజ్ చోప్రా. నేడు జరిగిన ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు. 2009 తర్వాత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పలువురు ప్రముఖులు నీరజ్ చోప్రాను అభినందనల్లో ముంచెత్తారు.

    దీంతో చోప్రా ఇంటి వద్ద హర్యానాలోని పానిపట్ లో సంబరాలు మిన్నంటాయి. మెడల్ ప్రకటించిన వెంటనే కుటుంబ సభ్యులు అతిథులకు లడ్డూలు పంపిణీ చేశారు. చోప్రా తల్లితోపాటు పలువురు మహిళలు నృత్యం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నీరజ్ చోప్రా తల్లి సరోజ్ చోప్రా మాట్లాడుతూ తన కొడుకు కష్టానికి ఫలితం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. తాము గోల్డ్ మెడల్ కోసం లక్ష్యంగా పెట్టుకున్నాము కానీ.. నీరజ్ రజతం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని నీరజ్ చోప్రా తాత ధరన్ సింగ్ చెప్పుకొచ్చారు.

    ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పథకం సాధించిన నీరజ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. అత్యున్నత అథ్లెట్లలో నీరజ్ ఒకడని.. భారత క్రీడల్లో ఇదో ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్ టోర్నీల్లోనూ పతకాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

    spot_img

    Trending Stories

    Related Stories