More

  ఇంకా 100 తీవ్రవాదులు ఉన్నారు

  కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే..! ఎప్పటికప్పుడు కార్డన్ సెర్చ్ లను కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి చేస్తూ ఉగ్రవాదులను జల్లెడ వేస్తూ ఉన్నారు. మరో వైపు పాకిస్థాన్ భారత్ లోకి తీవ్రవాదులను ఎప్పుడెప్పుడు పంపిద్దామా అనే ప్రణాళికలను రచిస్తూ ఉంది. గీత దాటిన ముష్కరులను భారత సైన్యం ఎప్పటికప్పుడు మట్టుబెడుతూ ఉంది.

  దక్షిణ కాశ్మీర్ లో ఇంకా 100 మంది తీవ్రవాదులు ఉన్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోమవారం నాడు తెలిపారు. 100 మంది తీవ్రవాదులలో ఇతర దేశాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారని సోమవారం నాడు జమ్మూకాశ్మీర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ జబ్బార్ మాట్లాడుతూ భారత ఆర్మీ, సెక్యూరిటీ ఏజెన్సీల సహకారంతో పోలీసులు తీవ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తూ ఉన్నారని వెల్లడించారు. కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో టెర్రరిస్టులు ల్యాండ్ మైన్లను ఉపయోగించి విధ్వంసం సృష్టించాలని అనుకుంటూ ఉన్నారని.. అయితే భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. తీవ్రవాదుల ఆలోచలనలను ఎప్పటికప్పుడు తాము పసిగడుతూ ఉన్నామని.. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని ఉగ్రవాదులు అనుకుంటూ ఉన్నారని వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రమాదాలను తగ్గిస్తూ ఉన్నామని అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ల్యాండ్ మైన్స్ ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉంచారో సమాచారం అందుకుని వాటిని నిర్వీర్యం చేశామని స్పష్టం చేశారు. అవంతిపోరాలో కూడా ఐఈడీ లను ఉపయోగించి బ్లాస్టులను చేయాలని తీవ్రవాదులు అనుకున్నారని.. సరైన సమయంలో పోలీసులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్ అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. తీవ్రవాదులు ఉంచిన ల్యాండ్ మైన్లను డిఫ్యూజ్ చేశామని అబ్దుల్ జబ్బార్ తెలిపారు.

  దక్షిణ కాశ్మీర్ లో ఇంకా కొందరు తీవ్రవాదులు దాక్కుని ఉన్నారని.. కాశ్మీర్ యువతను తీవ్రవాదం వైపు నడిపించేందుకు ఎన్నో ప్రయత్నాలను వారు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో కొందరు టాప్ మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయని.. ఎంతో మంది కాశ్మీరీ టెర్రరిస్టులను లొంగిపోవాలని కోరామని కూడా చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించాలని అనుకునే ఏ శక్తులను కూడా వదిలిపెట్టమని డిఐజీ అబ్దుల్ జబ్బార్ హెచ్చరించారు.

  Trending Stories

  Related Stories