షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి అనన్యపాండేకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు హెచ్చరించారు. చెప్పిన సమయానికి రాకుండా ఆలయంగా వచ్చింది. విచారణకు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా అనన్య మూడు గంటలు ఆలస్యంగా ఎన్సీబీ ఆఫీసుకు రావడంతో.. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా అనన్యకు అధికారులు సమన్లు ఇవ్వగా.. ఆమె మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిందని తెలుస్తోంది.ఇదేమి మీ సొంత నిర్మాణ సంస్థ కాదు.. ఎన్సీబీ ఆఫీసు. చెప్పిన టైంకు రాలేరా? కేసును విచారిస్తున్న అధికారులు మండిపడ్డారు. విచారణ సందర్భంగా అనన్యను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
శుక్రవారం నాడు ఆమెను ఎన్సీబీ అధికారులు సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు. అనన్య- ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ అందించినట్టు గతంలో ఓ వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడైందని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. తాను ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని అనన్య అధికారులకు తెలిపింది. గంజాయి గురించి అడిగిన ఆర్యన్ తో కేవలం తాను జోక్ చేశానని, అంతే తప్ప డ్రగ్స్ గురించి తనకేమీ తెలియదని అధికారులకు స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్ కోసం అనన్య డ్రగ్స్ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది. గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు వారి చాట్ లో ఉందని.. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్లు మీడియాలో వచ్చాయి. ఆమె నుంచి ఇంకా సమాచారం సేకరించాలని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు సోమవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు.