More

    నయనతార-విఘ్నేష్ ల చుట్టూ సరోగసీ వివాదం.. ఐదేళ్ల జైలు శిక్ష..?

    ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులయ్యారు. ఆదివారం, అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా ఈ శుభవార్త పంచుకున్నారు. తమ పిల్లలతో ఆ జంట ఉన్న ఫోటోను పోస్టు చేశారు. 2022 జూన్ 9న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నయనతార మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత నెల రోజులకు పైగానే ఇద్దరు దుబాయ్ వెళ్లి హనీమూన్ చేసుకున్నారు. సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలు అయ్యారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు.

    అయితే ఈ దంపతులు వివాదంలోనే చిక్కుకున్నారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడంపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసీ ద్వారా కాదు పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. చట్ట పరంగా దత్తత తీసుకుంటే పర్వాలేదు. లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలంటూ నయన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు పంపింది.

    Trending Stories

    Related Stories