విశాఖపట్నం: డిసెంబర్ 4 నేవీ డే సందర్భంగా తూర్పు నౌకదళం నిర్వహించిన విన్యాసాల రిహార్సల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆపరేషనల్ డెమో పేరిట తూర్పు నౌకదల సిబ్బంది ముందుగా బీచ్ రోడ్లో ఈ విన్యాలను ప్రదర్శించడం యేటా వస్తున్న ఆనావాయితీ. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ విన్యాసాలను నౌకదళం అధికారులు రద్దు చేశారు. కరోనా నుండి ఉపశమనం లభించడంతో ఈ ఏడాది తిరిగి నేవీ డే వేడుకలను నిర్వహిస్తోంది. చేతక్ విమానాలు, మిగ్, హుక్స్ వంటి యుద్ధ విమానాలు బాంబులు జారివిడిచిన దృశ్యాలు సందర్శకులను అబ్బురపరిచాయి. పారచుట్ల సాయంతో తీరాన నౌకదళం సిబ్బంది సాహసపేతంగా దిగిన దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇక జెమిని బోట్ల వేగాన్ని చూసి కాస్త ఒళ్ళు గగూర్పొడిచినా… సందర్శకులు మాత్రం ఆనందించారు. తొలి రెండు రోజులు సుమారు గంటపాటు ప్రదర్శించిన నావికా సిబ్బంది. మూడో రోజు మాత్రం కేవలం విన్యాసం ప్రదర్శించడంతో కొంతమంది సందర్శకులు నిరాశకు గురయ్యారు.