More

    చేస్తున్న ప్రతి ఒక్క రోటీలోకి ఉమ్మివేస్తూ.. వీడియో రికార్డు చేయకుండా ఉండి ఉంటే..!

    రోటీలను తయారు చేస్తున్న సమయంలో ఉమ్మి వేసిన ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. తందూరీ రోటీ తయారు చేస్తున్నప్పుడు పిండిపై ఉమ్మి వేసిన నౌషాద్‌ను అరెస్టు చేసినట్లు మీరట్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ సంఘటన డిసెంబర్ 2, 2021 న ఎంగేజ్‌మెంట్ పార్టీలో చోటు చేసుకుంది. నౌషాద్‌ పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.ఎంగేజ్‌మెంట్‌లో క్యాటరింగ్‌ నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ నౌషాద్‌ని నియమించుకున్నాడు. కానీ నౌషాద్‌ ఇలా చేస్తాడని ఆ కాంట్రాక్టర్ ఊహించలేదు. కాంట్రాక్టర్‌ ను బాలేశ్వర్‌గా గుర్తించారు. అతడిని కూడా పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

    ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కంకర్‌ఖేరాలోని లక్ష్మీనగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నౌషాద్ రోటీపై ఉమ్మివేస్తుండగా ఓ అతిథి తన కెమెరాతో రికార్డు చేశాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులకు వీడియో చూపించాడు. వరుడి తండ్రి సియానంద్ వెంటనే కంకరఖేడ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నౌషాద్‌తో పాటు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

    నౌషాద్ మొదట ఆరోపణలను ఖండించాడు. అయితే, పోలీసులు వీడియోను అతనికి చూపించడంతో, అతని నోటి నుండి ఇంకా మాట రాలేదని తెలుస్తోంది. నౌషాద్ మీరట్‌లోని నంగ్లటాషి సమీపంలోని కైత్‌వాడి నివాసి. ఫిర్యాదును స్వీకరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సక్సేనా తెలిపారు. విచారణ ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నౌషాద్ ఆరు నెలల క్రితం జరిగిన పెళ్లిలో కూడా ఇదే పని చేశాడని అతని స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. ఎవరూ అతనిని రికార్డ్ చేయలేదని అతను రోటీ చేస్తున్నప్పుడు పిండిపై ఉమ్మి వేస్తాడని అతడి స్నేహితులకు తెలుసునన్నారు.

    ఇలాంటి ఘటనలు చాలానే బయటకు:

    ఆహారంపై ఉమ్మివేస్తున్న పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. రోటీ చేస్తున్నప్పుడు పిండిపై ఉమ్మి వేసినందుకు అరెస్టయిన వ్యక్తుల్లో ‘నౌషాద్’ కూడా ఒకడు. ఫిబ్రవరి 2021లో మీరట్‌లో ఇదే విధమైన కేసు నమోదైంది. గత ఏడాది కాలంలో, ఒక వర్గానికి చెందిన వంటవారు ఆహారంపై ఉమ్మివేసి కెమెరాకు చిక్కారు. ఇలాంటి కేసుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు క్రమం తప్పకుండా కెమెరా కంటపడుతూనే ఉన్నాయి. దేశం కోవిడ్ -19 వైరస్ తో పోరాడుతున్న తరుణంలో, సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టాల్సిన అవసరం ఉంది.

    Trending Stories

    Related Stories