నాలుగేళ్లలోనే అశేష ప్రేక్షకాదరణ చూరగొని తెలుగు నేలపై జాతీయవాద జర్నలిజానికి కేరాఫ్‌గా నిలిచింది నేషనలిస్ట్ హబ్. ఇటీవలే NH టీవీ పేరుతో 24*7 టీవీ ఛానెల్‌గా కూడా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ శుభ సందర్భంగా అతిరథ మహారథులు, రాజకీయ ఉద్ధండుల మధ్యలో ‘రణక్షేత్రం’ పేరుతో కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జాతీయవాదులకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది నేషనలిస్ట్ హబ్. 16 సెప్టెంబర్ 2023న ఉదయం 09 గంటల నుంచి సా. 6 గంటల వరకు కాంక్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ లోని వేదిక విశ్వేశ్వరయ్య భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు, రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.
నేషనలిస్ట్ హబ్ ఛానల్ 4 వసంతాలు పూర్తి చేసుకుని, 5వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 16న రణక్షేత్రం పేరుతో కాంక్లేవ్ నిర్వహిస్తూ ఉంది. అందువల్ల, ఈ వారం నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ కార్యక్రమాలు ప్రసారం చేయలేకపోతున్నాం. సహృదయులైన ప్రేక్షకులు గమనిస్తారని ఆశిస్తున్నాం. కాంక్లేవ్ కు మీరంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.