నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారిగా జాతీయ గీతాలాపన..!

0
866

మోదీ హైతో మున్కిన్ హై..! అంటే ఇదేనేమో…! ఇది వినేందుకు కాసింత విడ్డురంగానే ఉన్నా… నిజం.! మన దేశంలో…అందులోనూ ఒక రాష్ట్ర అసెంబ్లీలో దాదాపు 40 ఏళ్ళ పాటు జాతీయ గీతమైన జనగణమన ఆలపించలేదనే విషయం ఎంతమందికి తెలుసు! భారత్ అంటేనే… రాష్ట్రాల సమూహం.! సమాఖ్య వ్యవస్థకు ప్రతీకగా పేర్కొంటారు. భారత్ లో రాష్ట్రాలు అంతర్భాగం.., అలాగే ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా…, రాష్ట్రాల సరిహద్దులను మార్చాలన్నా కూడా అన్ని పవర్స్ కేంద్ర ప్రభుత్వానికి, భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటాయి.

అసోం లోని తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో నాగ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. తమకంటు ప్రత్యేక రాష్ట్రం కోసం నాగా ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు. 1963లో అసోం నుంచి నాగా ప్రజలు ఎక్కువగా నివసించే జిల్లాలతో నాగాలండ్ పేరుతో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.నాగాలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా నాగా వేర్పాటువాద ఉద్యమాలు మాత్రం ఆగలేదు.మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లోని నాగా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను సైతం నాగాలాండ్ లో కలపాలనే డిమాండ్ ను మొదలు పెట్టాయి. ఇంకా కొన్ని గ్రూపులైతే… ప్రత్యేక నాగాలాండ్ దేశం కోసం ఆయుధాలు పట్టాయి. జమ్ముకశ్మీర్ కు మాదిరిగా తమకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా ఉండాలని డిమాండ్ చేశాయి.

అయితే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…, దశాబ్దాలకు పైగా నలుగుతున్న నాగాల ఉద్యమానికి పరిష్కారం కనుగోనే దిశగా అడుగులు వేసింది. ఈ బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కు అప్పగించింది. కేంద్రప్రభుత్వం నాగా గ్రూపులతో చర్చలకు రెడీ అవుతున్న సమయంలోనే… ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి జరిపారు. దీంతో నార్త్ ఈస్ట్ ఉగ్రవాదుల స్థావరాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన NSA అజిత్ దోవల్… తనదైన రీతిలో పావులు కదిపారు. మయన్మార్ అడవుల్లో తిష్టవేసిన ఉగ్రవాద శిబిరాలపై ము ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపింది.అనేకమంది ఉగ్రవాదులు సైన్యం జరిపిన దాడిలో హతమయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన చర్యల కారణంగా నాగా వేర్పాటువాద గ్రూపులు చర్చలకు దిగిరాక తప్పలేదు. నాగాలాండ్ కు సంబంధించి ప్రధాన వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-NSCN-IM వర్గంతో మోదీ ప్రభుత్వం మొదట శాంతి చర్చలు జరిపింది.NSCN-IM నాయకుడు మూయివా ను చర్చలకు ఒప్పించింది. అయితే తమకు ప్రత్యేక జెండా, రాజ్యాంగం లేనిదే తుది ఒప్పదానికి రాలేనని NSCN-IM నాయకుడు ముయివా తేల్చిచెప్పడంతో, మోదీ ప్రభుత్వం ప్లాన్ బిని అమలు చేసింది.

అటు జమ్మూకశ్మీర్ లాంటి స్టేట్ కే… ఆర్టికల్ 370, 35-ఏలను రద్దు చేసి… ప్రత్యేక జెండా, రాజ్యాంగం లేకుండా చేసిన మోదీ సర్కార్ ను చూసిన తర్వాత… నాగా వేర్పాటువాద గ్రూపులు తమ డిమాండ్లను మరోసారి సమీక్షించుకున్నాయి. ప్రత్యేక నాగా జెండా, ప్రత్యేక రాజ్యాంగం వంటి డిమాండ్లపై వెనక్కి తగ్గాయి. దీంతో NSCN-IM తప్పించి… మిగిలిన నాగా వేర్పాటువాద సంస్థలు… కేంద్రంతో ఒప్పందానికి ముందుకు వచ్చాయి. ఇటు నార్త్ ఈస్ట్ లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా నార్త్ ఈస్టు కనెక్టివిటీని పెంచుతూ అనేక ప్రాజెక్టులు చేపట్టి అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. ఇనాళ్లపాటు ఉగ్రవాదం హింసాకాండ కారణంగా అభివృద్ధికి నొచుకోలేని నాగా ప్రజలు సైతం వేర్పాటువాదుల తీరుతో విసిగిపోయారని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే చెప్పాయి. ఏమాత్రం స్థానిక బలం కూడా లేని ఆ రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. NDPPతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. ఇలా వేర్పాటువాద ఉద్యమాలకు నెలవుగా మారిన నాగాలాండ్ ను జాతీయ జీవన ప్రధాన స్రవంతిలో మమేకం చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఏనాడు కూడా జాతీయ గీతం పాడేందుకు ముందుకు రాని నేతలు, చట్ట సభ సభ్యులు…ఇప్పుడు జాతీయగీతం పాడేందుకు ముందుకు వచ్చారు. ఈ చారిత్రత్మక దృశ్యం ఫిబ్రవరి 12వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా జరిగింది. గవర్నర్ ఆర్ఎస్ రవి ప్రసంగానికి ముందు సభ్యులందరూ లేచి నిలబడి జాతీయగీతాన్ని ఆలపించారు. తొలిసారిగా నాగాలాండ్ లో జాతీయ గీతాలపాలనకు సంబంధించిన ఈ విషయాన్ని రక్షణ రంగ విశ్లేషకుడు నితిన్ ఏ గోఖలే ట్వీట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

17 + 8 =