ప్రపంచంలో భారీ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! మోదీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం. కీలక సూచనలను, సలహాలను, సందేశాలతో పాటు ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మోదీకి ట్విట్టర్ లో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆయన సరికొత్త మైలు రాయిని ట్విట్టర్ లో అందుకున్నారు.
ట్విట్టర్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తున్న వారి సంఖ్య 70 మిలియన్ మార్క్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. 2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ చేరగా.. 2011 నవంబర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు పెరగ్గా.. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారీగా పెరిగారు. 2020 జులై నెలలో మోదీ ఫాలోవర్ల సంఖ్య 60 మిలియన్లను అందుకోగా.. తాజాగా 70 మిలియన్లకు చేరింది. మోదీ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ట్విట్టర్ ఖాతాను 53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 30.9 మిలియన్లు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు 7.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌షాకు 26.3 మిలియన్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ యూఎస్ క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు 88.7 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 129.8 మిలియన్లు ఉన్నారు.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికరమైన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జాతీయ పార్క్‌లో దాదాపు 3 వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న దృశ్యం అది. పెద్ద గుంపుగా వరసగట్టిన జింకలు చెంగుచెంగుమంటూ రోడ్డు దాటుతున్న తీరు ఎక్సలెంట్ అంటూ మోదీ దీన్ని షేర్ చేశారు. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన వీడియోను మోదీ కూడా షేర్ చేశారు.