National

ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 10 గంటలకు(22-10-2021)న జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో ఆయన స్పీచ్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. “PM @narendramodi will address the nation at 10 AM today.” అంటూ ట్వీట్ వేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్ వ్యాక్సినేషన్ లో 100 కోట్ల మైలురాయిని చేరుకోవడంతో ప్రజలతో పలు విషయాలను మోదీ పంచుకునే అవకాశం ఉంది. భారత్ గురువారం ఉదయమే 100 కోట్ల వ్యాక్సిన్ల మైలు రాయిని అందుకుంది. ఎంతో మంది భారత్ లాంటి దేశానికి వ్యాక్సిన్లు అందించడమంటే చాలా కష్టమని.. కోట్లలో భారత్ లో మరణాలు సంభవిస్తాయని అన్నారు. అయితే భారత ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడం.. ఆ తర్వాత స్వదేశీ వ్యాక్సిన్లను తీసుకుని రావడంతో కరోనా ముప్పు భారీగా తగ్గిపోయింది. ఇప్పటికీ కొన్ని దేశాలు కరోనాతో అల్లాడుతూ ఉంటే.. భారత్ లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఈ విషయాలన్నీ మోదీ నేటి స్పీచ్ లో చెప్పవచ్చని భావిస్తూ ఉన్నారు.

భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16 న హెర్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభించారు. క‌రోనా ఫ్రంట్ లైన్ యోధుల అంద‌రికీ ఇస్తూ.. దేశంలో ఫిబ్రవరి 19న‌ కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న‌ 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భార‌త్ నిలిచింది. జూన్ 12న‌ 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న‌ 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింది. నిన్నటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింద‌ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Related Articles

Back to top button