More

    అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

    కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ కొద్దిసేపట్లో పార్లమెంటులో క్లుప్తంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్ సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయితేజ, హవాల్దార్ సత్పాల్ ఉన్నారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రావత్ భార్య మధులిక మృతి చెందారని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories