More

    ఆ పదవి నుండి తప్పుకుంటానన్న నారా లోకేష్

    మ‌హానాడు వేదిక‌గా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హానాడులో మీడియాతో మాట్లాడుతూ.. నేత‌ల‌కు సుదీర్ఘ ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేయాలంటూ తాను ఓ ప్ర‌తిపాద‌న పెట్టాన‌ని లోకేశ్ తెలిపారు. నేత‌ల‌కు సుదీర్ఘ కాలం పాటు పార్టీ ప‌ద‌వులు వ‌ద్దన్న కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తే ఆ కొత్త విధానాన్ని మొద‌లుపెట్టాల‌ని తాను భావిస్తున్నాన‌ని లోకేశ్ తెలిపారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శిగా తాను ఇప్ప‌టికే మూడు సార్లు ప‌నిచేశాన‌ని, ఈసారి ఆ ప‌ద‌వి నుంచి తాను దిగిపోతాన‌ని కూడా లోకేశ్ చెప్పారు. త‌న రాజీనామాతో ఖాళీ కానున్న ఆ ప‌ద‌విని ఇంకో నేత‌కు ఇస్తామ‌ని.. ఈ త‌ర‌హాలోనే పార్టీలో 2 ప్లస్ 1 విధానం అమ‌ల్లోకి రావాల్సి ఉంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విధానం ప్ర‌కారం ఏదేని ప‌ద‌విలో ఒకే నేత రెండు సార్లు వ‌రుస‌గా కొన‌సాగితే… మూడో సారి ఆయ‌న‌కు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. వ‌రుస‌గా మూడుసార్లు ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌ల‌కు నాలుగో ప‌ర్యాయం టికెట్ ఇవ్వ‌రాద‌న్న దిశ‌గానూ పార్టీలో కీల‌క చ‌ర్చ జ‌రుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని తెలిపారు.

    Trending Stories

    Related Stories