More

    పాదయాత్ర మొదలుపెట్టనున్న నారా లోకేష్

    ఏపీ రాజకీయాల్లో మరో పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని లోకేశ్ చెప్పారు. పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ ఈ నెలాఖరు నుంచి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. పాదయాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పలు టీమ్ లను ఏర్పాటు చేశారు.

    Trending Stories

    Related Stories