నారా లోకేష్.. ఇప్పటంలో టూర్..!

0
777

ఇప్పటం గ్రామంలో నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం కూల్చివేతలు జరగడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే..! ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చి వేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంటికి లక్ష పరిహారం కూడా ప్రకటించారు. తాజాగా నారా లోకేష్ ఆ గ్రామంలో పర్యటించనుండడంతో మరోసారి అక్కడ ఏమి జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది.

ఇప్పటం గ్రామంలో ఇంత జరుగుతున్నా నారా లోకేష్ రాకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉందని ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్‌ పర్యటించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ రావడం ఏమిటని వైసీపీ మంత్రి రోజా ప్రశ్నించిన సంగతి తెలిసిందే..! పవన్ ను కరివేపాకులా ముందుకు తోశారని రోజా ఆరోపించారు.