More

    నారా లోకేష్ అరెస్ట్..!

    గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెళ్లారు. ఆయన పర్యటనలో భాగంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసం లోకేశ్‌ వచ్చారని వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు.లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

    బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై అంతకు ముందు ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా.. రమ్యని చంపేసిన 12 గంటల తర్వాత బాధాకరం అంటూ ట్వీట్ చేశారు నిద్ర మొఖం పాలనలో ఎంతమంది అమ్మాయిలను బలి చేస్తారు’ అంటూ లోకేష్ ప్రశ్నించారు. ‘దిశ’ చట్టం అంటూ జగన్ రెడ్డి గారు బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు లోకేష్. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? అంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు. ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories