More

    మీ ప్రాంతంలో వినాయక విగ్రహాలు పెట్టనివ్వలేదు.. ఇవన్నీ హిందువుల ఇళ్లు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి

    హిందువుల ఇళ్ల వద్దకు వచ్చి అన్యమత ప్రచారాన్ని చేస్తున్న వ్యక్తులను స్థానికులు అడ్డుకున్నారు. ఎవడు చేశాడయ్యా పాపము ఇక్కడ.. మేము పాపం ఎందుకు చేస్తాం.. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇవే మాటలా.. ఇక్కడ ఉన్న వాళ్లందరూ హిందువులు, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ ఓ వ్యక్తి అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టనివ్వలేదని.. అలాంటప్పుడు మీరు మా ఇళ్ల దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించడంతో మత ప్రచారకులు నీళ్లు నమిలారు.

    మా ప్రాంతంలో మత ప్రచారం చేస్తే క్షమించేది లేదని అన్నారాయన. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుందని తెలుస్తోంది. శివుడిని నమ్మవయ్యా.. అఖండ సినిమాకు వెళదాం పద.. సనాతన ధర్మం ఏమిటో తెలుస్తుంది పదా అంటూ రమ్మని పిలిచాడు. అత్యాచారాలు, దోపిడీలు చేసిన వారిని రక్షిస్తారా..? అంటూ హిందూ వ్యక్తి చెప్పడంతో అక్కడి నుండి మత ప్రచారకులు జారుకున్నారు.

    Trending Stories

    Related Stories