National

ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్..!

ఛత్తీస్ గఢ్ లో ముఖ్యమంత్రి తండ్రిని అరెస్టు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్‌ తండ్రి నందకుమార్ బాఘేల్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను రాయ్ పూర్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.

నందకుమార్ బాఘేల్‌ ఇటీవల ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “బ్రాహ్మణులను విదేశీయులని అన్నారు. బ్రాహ్మణులను గంగా నది నుంచి వోల్గా నదికి పంపించి వేయాలి. వారు మన దేశానికి చెందినవారు కాదు. వారు మనల్ని అంటరానివారుగా చూస్తుంటారు. మన హక్కులన్నీ లాగేసుకున్నారు. అందుకే బ్రాహ్మణులను ఎవరూ గ్రామాల్లోకి రానివ్వరాదు. వారిని బహిష్కరించాలి” అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. నంద్‌ కుమార్‌ బాఘేల్‌ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలపై సర్వ్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ సభ్యులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులను విదేశీయులు అని.. వారిని బహిష్కరించాలని నంద్‌ కుమార్‌ బాఘేల్‌ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ సంస్థ తన ఫిర్యాదులో తెలిపింది. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ బాఘేల్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని పోలీసులకు తెలిపింది. ఆయనపై చర్చలు తీసుకోవాలని కోరింది. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్‌ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ కేసు నమోదైన క్రమంలో సీఎం భూపేష్ బాఘేల్‌ వ్యాఖ్యానిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ స్పందిస్తూ ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను. మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్‌ చెప్పుకొచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని 86 ఏళ్ల మా నాన్న కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని సమాజాలను గౌరవిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిస్తామని.. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మా నాన్న చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించాయని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆయన వ్యాఖ్యల పట్ల నేను కూడా బాధపడుతున్నానని భూపేశ్‌ బాఘేల్‌ చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − eight =

Back to top button