తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2. ఈ షోలో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్ రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ అందించింది ఆహా టీం. ఇందుకు సంబంధించి ఇవాళ ఆహా అన్‌స్టాపబుల్2.. ఎపిసోడ్ 5 ప్రోమోను విడుదల చేసింది. ’90 సంవత్సరాల తెలుగు సినిమా కీర్తి.. యుగ పురుషుడి (ఎన్టీఆర్)కి శత జయంతి నివాళి.. ఈ అద్భుతమైన ఎపిసోడ్‌ని మిస్ అవ్వకండి..’ అంటూ విడుదల చేసిన ప్రోమో బాలకృష్ణ సరదా చిట్‌చాట్‌తో అభిమానులకు పసందైన వినోదాన్ని పంచుతుంది. అన్‌స్టాపబుల్ 2 తాజా ప్రోమో వైరల్ అవుతోంది.