నందమూరి బాలకృష్ణ # NBK107 టైటిల్ అక్టోబర్ 21న విడుదల

0
1036
nandamuri blakrishna #NBK107 Tittle oct 21st
nandamuri blakrishna #NBK107 Tittle oct 21st

టసింహ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌ తో సినిమా అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఆర్‌ ఎఫ్‌ సి లో జరుగుతోంది.
ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. NBK107 టైటిల్‌ ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే మేకర్స్ ఖరారు చేసిన అసలు టైటిల్ ఏంటో మరో ఐదు రోజుల్లో తెలియనుంది.
శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 1 =