More

    కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ

    హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తాను కరోనా బారినపడ్డట్లు బాలయ్య బాబు స్వయంగా తెలిపారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌ లోనే ఉన్నారు. తాను పూర్తీ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నానన్నారు. తన గురించి ఆందోళన చెందవద్దని తన అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు.

    ‘అఖండ’ విజయంతో బాలకృష్ణ సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య.

    Trending Stories

    Related Stories