యాక్టివ్ అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

0
879

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపేసి ఢిల్లీ నుండి వచ్చారు. త్వరలోనే ఆయనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొత్త బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం పర్యటించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కలికిరి చేరుకున్న మాజీ సీఎంకు ఏపీసీసీ కార్యదర్శి అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ నేత శ్రీవర్ధన్, పలువురు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కలికిరి పర్యటనలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఆయన కొడుకు నిఖిలేశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. సొంత గ్రామం నగరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం కిరణ్ రెడ్డి కలికిరి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు నల్లారితో వ్యక్తిగత పరచయమున్న నేతలందరూ గెస్ట్ హౌస్ కు వచ్చారు. త్వరలో వస్తానని అన్ని విషయాలను మాట్లాడుకుందామని తనను కలసిన వారితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.