International

అమెరికాలో గన్ కల్చర్ కు బలైన నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

అమెరికా గన్ కల్చర్ కు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ (26) ఆదివారం సాయంత్రం అమెరికాలోని మేరీల్యాండ్‌లో కాల్పుల్లో మృతిచెందాడు. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో సాయి చరణ్ కారులో వెళ్తుండగా ఓ నల్లజాతీయుడు కాల్పులు జ‌రిపాడు. కాల్పుల్లో సాయి చరణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. సాయి చరణ్ ను యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ R. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు, అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సాయి చరణ్ తలపై తుపాకీ గాయం కనిపించింది. సాయి చరణ్‌ తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దించి కారులో తన నివాసానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం వచ్చింది. సాయి చరణ్ మ‌ర‌ణవార్త విన్న తల్లిదండ్రులు క‌న్నీరుమ‌న్నీరుగా విల‌పిస్తున్నారు. సాయి చరణ్ గత రెండేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button