ఇటీవలి కాలంలో బీహార్ లో మరోసారి బెదిరించి పెళ్లిళ్లు చేయడాలు జరిగిపోతూ ఉన్నాయి. పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి పెళ్లిళ్లు చేసేస్తూ ఉన్న ఘటనలు మరీ పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా అలా పెళ్లి చేయబడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు.
బీహార్‌లోని నలంద జిల్లాలోని మన్‌పూర్‌లో ఓ యువకుడికి ఇష్టం లేకున్నా బలవంతంగా వివాహం చేసిన ఘటన బయట పడింది. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ అనే వ్యక్తి మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరోహా గ్రామ సమీపంలో తనను స్థానికులు బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారని పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తనను రాత్రంతా బంధించారని.. ఇష్టం వచ్చినట్లు తిట్టారని వాపోయాడు. నవంబర్ 11న అతను ఛత్ పూజ కోసం తన సోదరి అత్తారింటికి వెళ్లినట్లు తెలిపాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా పరోహా గ్రామంలో ముగ్గురు ఆయుధాలు కలిగిన వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారని నిందితుడు వాపోయాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని అతడిని ఒత్తిడి చేశాడు. మొదట అతడు పెళ్లికి నిరాకరించడంతో కొట్టారని కూడా వాపోయాడు. యువకుడి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. తనకు న్యాయం చేయాలని నితీష్ కుమార్ వాపోయాడు.