More

    నైనా జైస్వాల్ కు వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

    హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు ఆన్ లైన్ లో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో నైనా జైశ్వాల్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. నైనా జైస్వాల్ ను తన సోషల్ మీడియా ఖాతాలో కొందరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫేక్ ప్రొఫైల్‌లు వాడుతున్న దుండగులు గత కొన్ని రోజులుగా తనను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే సందేశాలు పంపుతున్నారని జైస్వాల్ తండ్రి పోలీసులకు సమర్పించారు. ఇటీవల వేధింపులు మరింత పెరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ గజరావు భూపతి మాట్లాడుతూ సదరు యువ క్రీడాకారిణికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్ లో అభ్యంతరకర రీతిలో సందేశాలు పంపుతున్నాడని తెలిపారు. ఇది ఐటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హైదరాబాదులోని కాచిగూడలో నివసించే నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయంగా అనేక విజయాలు సాధించింది. ఆమెకు సోషల్ మీడియాలో ఇంతకుముందు కూడా ఇలాగే వేధింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. లా గ్రాడ్యుయేట్ అయిన జైస్వాల్ ఫిబ్రవరిలో తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    spot_img

    Trending Stories

    Related Stories