More

  పరువు హత్యా..? మతోన్మాదమా..??

  హిందువు అబ్బాయి నాగరాజు.. ముస్లిం అమ్మాయి ఆశ్రిన్ సుల్తానా. ఇద్దరు కాలేజీలో ఉన్న సమయం నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఒక్కటవ్వాలనుకున్నారు. నాగరాజు ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. ఆశ్రిన్ కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోలేదు.

  దురదృష్టవశాత్తు వారి ప్రేమను అర్ధం చేసుకున్న ఆశ్రిన్ తండ్రి వారి వివాహం చేయకుండా చనిపోయాడు. ఆ తర్వాత కుటుంబ పెద్దలుగా మారిన ఆశ్రిన్ అన్న.. నాగరాజును మరిచిపోవాలని ఒత్తిడి తెచ్చాడు. ప్రేమించివాడిని విడిచిపెట్టలేక కుటుంబానికే దూరం కావాలని నిర్ణయించుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి నాలుగు నెలల క్రితం నాగరాజును వివాహం చేసుకుంది. అంతే.. ఆశ్రిన్ అన్న కక్ష పెంచుకున్నాడు. అందులోనూ ముస్లిం అయి ఉండి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సమయం కోసం వేచి చూశాడు.

  నాగరాజు, ఆశ్రిన్ లు ఒంటరిగా దొరకడం కొసం రెక్కీ చేశారు. చివరికి వనస్థలిపురంలో ఒంటరిగా దొరికిన నాగరాజుపై ఆశ్రిన్ ముందే విచక్షణారహితంగా దాడికి పాల్పడారు. రాడ్డు, కత్తులతో దాడి చేశారు. ఒకవైపు.. కాపాడండి అంటూ ఆశ్రిన్ అరుపులు… మరోవైపు… దెబ్బలకు తాళలేక నాగరాజు అర్తనాదాలు… అక్కడి వారిని కదిలించలేకపోయాయి. తోడబుట్టిన చెల్లి పసుపు కుంకుమలను చెరిపేయాలని పగ బట్టిన అన్న.. రాక్షసుడిలా నాగరాజు శిరస్సును ఛిద్రం చేశాడు. ఆశ్రిన్ ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు దాడి జరిగినా ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడి జరిగినంత సేపు నాగరాజును కాపాడుకునేందుకు ఆశ్రిన్ ఒంటరి పోరాటం చేసింది. ఓ వైపు అన్నను ఆపుతూనే మరోవైపు స్థానికులను కాపాడండి అంటూ వేడుకుంది. చివరికి నాగరాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు.

  ఇక్కడ రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి నాగరాజుపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయని స్థానికులు. హిందువు అబ్బాయిని పెళ్లి చేసుకుందని హత్యకు పాల్పడిన ఆశ్రిన్ అన్న. ఈ రెండు కోణాలు పరిశీలిస్తే మారుతున్న సమాజంలో మానవత్వం మసకబారుతోందని స్పష్టంగా అర్ధం అవుతోంది. కాకి చనిపోతేనే వంద కాకులు వచ్చి గూమిగూడుతాయి. అలాంటిది సాటి మనిషిపై కృూరంగా కళ్లెదుటే దాడి జరుగుతున్నా ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇది నిజంగా సమాజానికి సిగ్గుచేటు. మన కూతురు లాంటి ఆడపడుచు ఆదుకోండి అంటూ అర్దిస్తున్నా బండబారిన మనసులతో జరుగుతున్న హింసను చోద్యం చూసినట్లు చూశారే కానీ.. నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక రెండో విషయానికి వస్తే నాగరాజును ఆశ్రిన్ అన్న హత్య చేయడానికి ప్రధాన కారణం నాగరాజు హిందువు కావడమే. ముస్లిం అమ్మాయి అయిఉండి హిందువును పెళ్లి చేసుకుందనే కక్షతోనే దాడికి పాల్పడ్డారు. ఇది స్వయంగా నాగరాజు భార్య ఆశ్రిన్ చెప్పిన మాటే.

  ఈ ఘటనను పరువు హత్యగా చిత్రీకరించడం మొదలు పెట్టారు. ఇది ఎంతటి దారుణం అంటే మతోన్మాదాన్ని పరువు హత్యగా వర్ణిస్తూ ఛానళ్లు, పేపర్లలో వార్తలు వస్తున్నాయి. ఒక ఛానల్ అయితే పరువు హత్యపై పొలిటికల్ ఫైట్ అంటూ టైటిల్ పెట్టి వార్తలు ప్రసారం చేస్తుంది. ఒక వర్గం సృష్టిస్తున్న అరాచకాలను ప్రశ్నించే సత్తా లేని ఛానళ్లు, పేపర్లు.. నాగరాజు హత్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే అమృత ప్రణయ్‌కి సపోర్ట్‌గా దళితులు యుద్ధం చేశారు. ఇప్పుడు అదే నాగరాజు కనపడలేదా మీ కంటికి అంటూ కరాటే కళ్యాణి కూడా ప్రశ్నించారు. ముస్లిం అయితే ప్రశ్నించరా..? భయమా..? కళ్ళు తెరవండి ఇకనైనా.. అంటూ ఘాటుగా నిలదీశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రణయ్ దళితుడే.. నాగరాజు కూడా దళితుడే. మరి ప్రణయ్ విషయంలో పిడికిల్లు బిగించి పోరాటాలు చేసిన దళితులకు ఇప్పుడు నాగరాజు హత్య కనపడటం లేదా అంటూ నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఓ వర్గానికి భయపడి ఎన్నాళ్లు బతకగలం అంటూ నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నాగరాజు హత్యపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇకనైనా సమాజంలో మార్పు రావడంతో పాటు ఒక వర్గం చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన రోజు రోజుకు విస్తరిస్తోంది. ఆ వర్గం అరాచకాలను ఇంకెన్నాళ్లు కళ్లుండి గుడ్డివాళ్లలా చూస్తూ ఉంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  Trending Stories

  Related Stories