Telugu States

గడ్డి తింటున్న సీపీఐ నారాయణకు జనసైనికులు అన్నం పెట్టాలి: నాగబాబు

ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే..! ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు. ‘చిల్లర’ అంటూ వ్యాఖ్యలు చేశారు నారాయణ.. చిరంజీవిని కాకుండా సూపర్ స్టార్ కృష్ణను పిలిచి ఉంటే బాగుండేదని అన్నారు. చిరంజీవి పొలిటికల్ కెరీర్ పై కూడా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ వంటి వ్యక్తిని పిలవకుండా ఊసరవెల్లిలాంటి చిరంజీవిని వేదిక మీదకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఓ మందుపాతర లాంటివాడని, ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదని వ్యాఖ్యానించారు.

చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగాబ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. “కానీ మన కుర్రాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే… ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలాకాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండుగడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే… దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు” అంటూ నాగబాటు ట్విట్టర్ లో స్పందించారు.

Related Articles

Back to top button