Telugu States

హీరో నాగశౌర్య విల్లాలో భారీగా పేకాట.. బయటకు వస్తున్న షాకింగ్ విషయాలు

హైదరాబాద్ నగర శివారుల్లో ఆదివారం సాయంత్రం ఓ భారీ పేకాట క్లబ్ ను పోలీసులు బయటపెట్టారు. హీరో నాగశౌర్య కుటుంబ సభ్యుల పేరుతో ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం రేపింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న విల్లాపై దాడి చేశారు. సుమంత్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు తెలుస్తోంది. పేకాట రాయుళ్ల దగ్గర నుండి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు.

దీంతో ఈ ఘటనకు సంబంధించి నాగశౌర్య తండ్రికి నోటీసులిచ్చారు. నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్‌ విచారణలో చాలా విషయాలను బయట పెట్టాడు. సుమంత్ ఫోన్‌ను, కాల్‌ డేటాను అనలైజ్ చేయగా శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్‌హౌసుల్లో ఇదే దందా నడుపుతున్నాడని తెలుస్తోంది. ప్రతీ ఫామ్‌హౌస్‌కీ ఒక్కో వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ప్రతీ వాట్సాప్‌ గ్రూప్‌లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కార్డులు తెస్తే స్వైపింగ్ చేసుకోవచ్చు. కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్‌తో రావచ్చని తెలుస్తోంది.

ఫామ్‌హౌస్‌ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి బయటకి వస్తోంది. ఈ బుజ్జి నాగశౌర్యకు బాబాయి అని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. ఫామ్‌హౌస్‌ లీజ్ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ పేరు మీద ఉంటే.. ఫామ్‌హౌస్ కార్యకలాపాన్నీ బాబాయి బుజ్జీ చూసుకుంటున్నారని.. ఈయన పాత్రపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Related Articles

Back to top button