National

పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న మహిళా టీచర్.. ఉద్యోగం నుండి తొలగించేశారు

రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్ లో పని చేసే నఫీసా అటారీ అనే టీచర్ ను విధుల నుండి తొలగించారు. ఆదివారం ప్రపంచ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించగానే ఆమె సెలెబ్రేషన్స్ చేసుకోవడంపై స్కూల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను విధుల నుండి తొలగిస్తున్నామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఉదయపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్ టీచర్ నఫీసా అటారీ యొక్క వాట్సాప్ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. అటారీ తన స్టేటస్ లో “జీత్ గే, మేము గెలిచాము” అనే టెక్స్ట్‌తో పాక్ ఆటగాళ్ల చిత్రాన్ని పంచుకున్నారు. ఈ పోస్టుపై నఫీసా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోందని.. అలాంటి ఆమె తన తరగతిలో విద్యార్థులకు ఏమి బోధిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆమెను విధుల నుండి తొలగిస్తున్నామని తెలిపింది.

సోమవారం సాయంత్రం.. అనేక మంది నెటిజన్లు ట్విట్టర్‌లో ఆమెను తొలగిస్తూ పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నోటీసును పంచుకున్నారు. నఫీసాను సేవల నుండి తొలగించబడినట్లు తెలిపారు. సోజాతియా ఛారిటబుల్ ట్రస్ట్ సమావేశం నిర్వహించి నీర్జా మోడీ స్కూల్ టీచర్ నఫీసా అటారీ స్కూల్ నుండి తక్షణమే తొలగించబడ్డారని హిందీలో నోటీసు ఉంది. ఆ ట్రస్ట్ నీర్జా మోడీ స్కూల్‌ను నడుపుతోంది. రద్దుకు గల కారణాలను నోటీసులో పేర్కొనలేదు. ఉదయ్‌పూర్‌లోని నీర్జా మోడీ స్కూల్ ఈ వార్తలను ధృవీకరించింది. ఈ సమావేశంలో నఫీసా అటారీని తొలగించినట్లు పాఠశాల ధృవీకరించింది.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న సమాచారం ఖచ్చితమైనదని చెప్పారు.

సదరు టీచర్ వివరణ ఇస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ సందర్భంగా తన కుటుంబం రెండు జట్లుగా విడిపోయిందని, ప్రతి జట్టు ఇరువైపులా మద్దతునిచ్చిందని చెప్పారు. ఆమె బృందం పాక్ కు మద్దతు ఇవ్వడం.. ఆ తర్వాత గెలవడంతో తాను మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో స్టేటస్‌ను పోస్ట్ చేశానని తెలిపింది. తాను ఈ పని ఏదో తమాషాగా చేశానని వీడియోలో చెప్పుకొచ్చింది.

Related Articles

Back to top button