దేశంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో హిందువులపై దాడులు అంతకంతకూ పెరిగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో అయితే హిందువుల పెళ్లిళ్లను, ఊరేగింపులను, పండుగలనూ అడ్డుకోవడం చూస్తూనేవున్నాం. కొందరు ఉన్మాదులు హిందువుల ఇళ్లపై ‘హౌజ్ ఫర్ సేల్’ బోర్డులు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతున్న ఘటనల్నీ గమనిస్తున్నాం. తృణమూల్ పాలనలో బలవంతపు మతమార్పిడులు, బంగ్లాదేశ్ చొరబాట్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. దీదీ దీవెనలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా..? అనేంతగా మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ మతోన్మాద జాఢ్యం ఇతర రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లో హిందువుల ఇళ్లకు ‘హౌజ్ ఫర్ సేల్’ బోర్డులు తగిలిస్తే.. ఇక్కడో మతోన్మాది తన సొంత గ్రామాన్ని ఏకంగా పాకిస్తాన్‌తో పోల్చి పైశాచికానందం పొందాడు.
మధ్యప్రదేశ్ రేవా జిల్లా గుర్ నగర పంచాయితీలోని అమ్రేటీలో జరిగిందీ ఘటన. అమ్రేటీకి చెందిన అబ్రార్ ఖాన్ అనే 32 ఏళ్ల వ్యక్తి.. తన సొంతూరు ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. సొంతూరు ఫొటోను ఫేస్బుక్లో పెడితే తప్పేంటి అనే కదా మీ అనుమానం..! కానీ, ఆ ప్రబుద్ధుడు అంతటితో ఆగలేదు. ఆ ఫొటోతో పాటు.. ‘See Amreti – A Mini Pakistan’ క్యాప్షన్‌ను కూడా జతచేశాడు. భారత దేశంలో పుట్టి.. ఇక్కడి గాలి పీలుస్తూ.. ఇక్కడి తిండి తింటూ.. శత్రువు భజన చేశాడు. ఇక, ఆ వివాదాస్పద పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమీప గ్రామస్తులు, స్థానిక రాజకీయ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. అబ్రార్ ఖాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు, అమ్రేటి ముస్లిం మెజారిటీ గ్రామం అయినప్పటికీ.. అబ్రార్ ఖాన్ చేసిన పనికి గ్రామస్తులంతా చివాట్లు పెట్టారు.
ఇక, ఫిర్యాదు అందుకున్న పోలీసులు అబ్రార్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 153 తో పాటు.. ఐటీ చట్టానికి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనపై స్పందించి రేవా జిల్లా ఎస్పీ.. నిందితుడిని అరెస్ట్ చేశామని.. విచారణ జరుపుతున్నామని తెలిపారు. గతంలో అబ్రార్ ఖాన్ ఒమన్‌లో ఉండేవాడని.. అక్కడ ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేసేవాడని తెలిపారు. కొవిడ్ లాక్డౌన్ వల్ల ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడని అన్నారు.
ఇదిలావుంటే, గత మే నెలలో యూపీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అమేథీ నియోజకవర్గం రామ్‌గంజ్ ఏరియాలోని మంగ్రా గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ‘గ్రామ్ ప్రధాన్’గా ఎన్నికయ్యాడు. అంటే మనదగ్గర గ్రామ సర్పంచ్‌లా అన్నమాట. ఇక, ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో విజయం సాధించగానే అతని అనుచరులంతా కలిసి మే 4న గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విజయోత్సవ నినాదాలు చేశారు. ‘దేఖో ఇమ్రాన్ ఖాన్ ఆయా.. నయా పాకిస్తాన్ లాయా’ అంటూ పాటలు పాడారు. అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసులు ఇమ్రాన్ ఖాన్ అండ్ బ్యాచ్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అంతేకదు, ర్యాలీ సందర్భంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించి పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇలాంటి వివాదాస్పద కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తీవ్రంగా వుంటాయని.. గ్రామస్తులను కూడా హెచ్చరించారు. ఇలాంటి మతోన్మాద చర్యలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
ఇక, తాజా మధ్యప్రదేశ్ ఘటన విషయానికి వస్తే.. తన గ్రామాన్ని పాకిస్తాన్‌తో పోల్చిన అబ్రార్ ఖాన్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అంతేకాదు, అతడి ఫేస్బుక్ పోస్టును లైక్ చేసినవారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాల విషయంలో యోగి ప్రభుత్వంలా.. శివరాజ్ సింగ్ ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఓ హిందూ ర్యాలీపై రాళ్లు విసిరిన ఘటనలోనూ నిందితులను కఠినంగా శిక్షించారు మధ్యప్రదేశ్ పోలీసులు. దీంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశ సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను విస్మరించకూడదని.. ఇవి ఇలాగే కొనసాగితే.. దేశ భద్రతకే ప్రమాదమని జాతీయవాదుల హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మతోన్మాదులపై.. యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల్లా.. ఇతర రాష్ట్రాలు కూడా ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.