More

    తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ లేఖ రాసిన రాజా సింగ్

    ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చాలని లేఖలో ఐజీకి విజ్ఞప్తి చేశారు. తనకు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం పలు మార్లు మొరాయించిందని ఇప్పటికే బహిరంగంగా చెప్పుకొచ్చిన రాజా సింగ్ మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అని చెప్పుకొచ్చారు. నా భద్రతకు ముప్పు ఉంది. కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వడానికి కేసీఆర్‌ అనుమతి లేదా?. లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్‌లు తనపై దాడి చేసే అవకాశం ఉందని రాజాసింగ్ ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని.. వెంటనే కొత్త వాహనాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందని చెప్పినా మళ్లీ అదే వాహనం కేటాయిస్తున్నారని.. ఈ వాహనంలో ఎక్కడికి వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించినా.. అందులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. నాకు ఇచ్చిన వాహనం మార్చండి.. లేదా దీనిని కూడా తీసుకెళ్లండి. ఇలాంటి వాహనాన్ని ఎలా ఉపయోగించేదని లేఖలో పేర్కొన్నారు రాజా సింగ్.

    Trending Stories

    Related Stories