తమ పూర్వీకులు హిందువులేనంటూ బీహార్ మైనారిటీ మినిస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ మైనారిటీ సంక్షేమ మంత్రి జామా ఖాన్ మాట్లాడుతూ తన పూర్వీకులు రాజస్థాన్ కు చెందిన హిందువులు అని, తరువాత ఇస్లాం మతంలోకి మారారని చెప్పారు. చైన్పూర్ (కైమూర్) నుండి గెలిచిన బిఎస్పి ఎమ్మెల్యే జామా ఖాన్ ఇటీవల జెడి (యు) లో చేరి బీహార్ మైనారిటీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ, “నా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారు, వారు రాజ్‌పుత్‌లు. వారు తరువాత ఇస్లాం మతంలోకి మారారు ” చెప్పుకొచ్చారు. హిందువులను ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చుతున్న ఘటనలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న మతమార్పిడుల గురించి జామా ఖాన్ హాజీపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తన పూర్వీకులు భగవాన్ సింగ్ మరియు అతని తమ్ముడు జే రామ్ సింగ్ ఉన్నత కుల రాజ్‌పుత్‌లని తెలిపారు., 14 వ శతాబ్దంలో కైమూర్‌కు దండయాత్రలు మరియు యుద్ధాలను ఎదుర్కొన్న తరువాత తన ప్రత్యక్ష పూర్వీకుడు భగవాన్ సింగ్ ఇస్లాం మతంలోకి మారారని, అయితే భగవాన్ సింగ్ సోదరుడు జే రామ్ సింగ్ హిందువుగానే ఉన్నారని మంత్రి చెప్పారు. “జే రామ్ సింగ్ యొక్క వారసులు కైమూర్ లోని చైన్పూర్ ప్రాంతంలోని నా నౌఘరా గ్రామానికి దగ్గరగా ఉన్న సారయ్య గ్రామంలో ఇప్పటికీ నివసిస్తున్నారు” అని జామా ఖాన్ చెప్పుకొచ్చారు. తాను బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు కావాల్సిన అన్ని పనులు చేస్తోందని వెల్లడించారు. జెడి (యు) -బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సంకీర్ణానికి ఓటు వేయకపోయినా ముస్లిం సమాజం యొక్క సంక్షేమం కోసం తాము పని చేస్తూ ఉన్నామని వెల్లడించారు.