హస్తే.. హస్తే… లేలియా పాకిస్తాన్..! చీన్ కే లేంగే.., హిందూస్థాన్..! ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే..! నవ్వుతు..నవ్వుతూనే పాకిస్తాన్ తీసేసుకున్నాం..! ఇక బలవంతంగా హిందూస్థాన్ ను సైతం లాగేసుకుంటామనే అర్థం.! పాకిస్తాన్ ఏర్పాటు జరిగిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్ చేసిన నినాదం ఇది.!
మళ్లీ ఇప్పుడు బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళా ముస్లింల ఓట్ల కోసం తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇదే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. జిన్నా ముస్లింలీగ్ మాదరిగానే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నేతలు మళ్లీ పాకిస్తాన్ నినాదాలు చేస్తున్నారు. అది కూడా భారత్ ను నాలుగు ముక్కలు చేసి నాలుగు పాకిస్తాన్ లు చేస్తామని రెచ్చగొడుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత…షేక్ ఆలం ముస్లింలలో భావోగ్వేదాలను రెచ్చగొట్టి.. వారంతా తృణమూల్ కు ఓటు వేసేలా పాకిస్తాన్ పాట పడుతున్నాడు. భీర్ భూమిలోని బాస్ పూర్, నానోర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న షేక్ ఆలం…, దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటకు చేరితే భారత దేశంలో నాలుగు పాకిస్తాన్ లను సృష్టించవచ్చు అంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నాడు.
షేక్ ఆలం మాట్లాడుతూ… మనం ముస్లింలం… 30 శాతం , వారు అంటే ఇక్కడ హిందువులని అర్థం చేసుకోవాలి.! 70 శాతం వరకు ఉన్నారు. 70 శాతంగా హిందూ జనాభా మద్దతు అధికారంలోకి వస్తున్నారు.! దీనికి ముస్లింలు సిగ్గుపడాలి. మన ముస్లిం జనాభా అంతా ఒక్కచోటకు చేరితే దేశంలో మళ్లీ నాలుగు పాకిస్తాన్ లను సృష్టించగలం.! అప్పుడు 70 శాతం ఉన్న హిందూ జనాభా ఎక్కడికి వెళ్తారు? అంటూ…, ముస్లింలు ముస్లింలకు మాత్రమే ఓటు వేయాలనే సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశాడు.
ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ బెంగాల్ సహ ఇన్ చార్జ్ అమిత్ మాలవీయా.. షేక్ ఆలం చేసిన రెచ్చగొట్టే ప్రసంగం తాలుకూ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు.