పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్…బంగ్లాదేశ్ అనే దేశంగా ఆవిర్భవించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ఇది ఎవరు కాదనలేని నిప్పులాంటి నిజం. బంగ్లాదేశ్ కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు అన్ని ఇన్నికావు. ఆ దేశ ప్రజలు భారత్ కు రుణపడి ఉండాలి.అలాగే బంగ్లాదేశ్ లో 30 శాతానికిపై హిందువులు ఉండేవారు. కానీ ఏం చేస్తాం..! బంగ్లాదేశ్ ఆవిర్భావం జరగడమే ఆలస్యం ఆ దేశం భారత్ మాదిరిగా సెక్యులర్ దేశంగా కాకుండా… ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించబడింది.
ఎందుకు ఇప్పుడు ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నారా? అయితే అక్కడకే వస్తున్నాను. బంగ్లాదేశ్ ఆవిర్భవించి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఏడాదిపాటు పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తోంది షేక్ హసీనా ప్రభుత్వం.! ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ కూడా మార్చి 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ కూడా ఒక ప్రకటన చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వంటి కారణాలతో ప్రధాని మోదీ ఏడాది కాలంగా విదేశీ పర్యటనలకు వెళ్లింది లేదు. ఎక్కువగా వర్చువల్ సమావేశాల్లోనే ఆయన పాల్గొంటున్నారు. ఏడాది తర్వాత పీఎం మోదీ జరుపుతున్న తొలి విదేశీ పర్యటన కూడా ఇదే.
అయితే ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనను అక్కడి ముస్లిం మతోన్మాద సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పీఎం మోదీ తమ దేశంలో పర్యటించేందుకు వీలు లేదని, అందుకోసం మేము ఏమైనా చేస్తాం. అవసరమైతే ఉగ్రవాదులుగా కూడా మారుతామంటూ మార్చి 19 శుక్రవారం రోజున ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో మత సంఘాల నేతలు చేసిన ప్రసంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని బీరాలు పలికారు.
అయితే మోదీకి వ్యతిరేకంగా అక్కడి ముస్లిం మత సంఘాల నేతలు చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ కోసం భారతీయులు చేసిన త్యాగాన్ని ఆ దేశంలోని ముస్లిం సంఘాల నాయకులు అప్పుడే మర్చిపోయారంటూ.., చేసిన మేలును మరిచిపోయిన వారిని ఏమనాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే పీఎం మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం గుడాకాందీని పీఎం మోదీ మార్చి 27న దర్శించనున్నారు. మతువా సామాజిక వర్గం భారత్ తోపాటు బంగ్లాదేశ్ లోను ఉన్నారు.