More

  నమాజ్ చేయటం మానరు.. ఆ పాపాలు చేయటం ఆపరు.. మత మార్పిడిలపై యోగా గురువు మండిపాటు..!

  దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మతాల వారు చేస్తున్న స్వార్ధపూరిత పనుల వల్ల ఇతర మతాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఎంతసేపు తమ మతమే గొప్పదని.. మిగతా మతాల వారు చేతకాని వారు అనే ధోరణిలో మత మార్పిడిలకు పాల్పడటం.. ముఖ్యంగా హిందువులను చులకన భావంతో చూడటం.. హిందువులను అవమానించటం.. వారిపై దాడులకు దిగటం వంటి రాక్షస పనులు చేస్తుంటారు. వారి కుట్రలను హిందూ సమాజం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్న అదే పనిగా ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ దేశమైన భారత్ లోనూ ఇలాంటి ఘటనలు మనం తరచు చూస్తుంటాం. అలాంటి వారిపై యోగ గురువు రాందేవ్ బాబా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  ముస్లింలు విద్వేష వ్యాప్తి చేస్తూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూయిజం చెబుతుందని, తక్కిన రెండు మతాలు మతమార్పిడికి పాల్పడుతుంటాయని అన్నారు.

  ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారని.. ఆ తర్వాత వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేస్తారన్నారు. హిందూ అమ్మాయిలను వాళ్లు కిడ్నాప్ చేస్తూ.. అన్నిరకాల పాపాలకు పాల్పడతారన్నారు. మన ముస్లిం సోదరులు అనేక పాపాలు చేసినా నమాజ్ మానకుండా చేస్తారని చెప్పారు. అలా చేయమని వాళ్లకు నేర్పుతారని.. హిందూ మతం అలాంటిది కాదని అన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, అయితే జరుగుతున్నది అదేనని అన్నారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారని, కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారని అన్నారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని చెప్పారు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారని అన్నారు.

  హిందూయిజం హింసకు పాల్పడవద్దని, నిజాయితీగా ఉండాలని చెబుతుందని అన్నారు. తెల్లవారుజామునే లేవడంతో పాటు భగవంతుడిని ప్రార్థించాలన్నారు. యోగా చేయడంతో పాటు., మంచి పనులు, మంచి ఆలోచనలు చేయాలన్నారు. ఇష్టదైవాన్ని పూజించాలని హిందూయిజం చెబుతుందన్నారు. సనాతన ధర్మం మనకు బోధించేది ఇదేనని రామ్‌దేవ్ అన్నారు. ఆయన ప్రసంగానికి చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రామ్ దేవ్ బాబా మాట్లాడిన మాటలను హిందూ సమాజం స్వాగతీస్తే.. కొన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి.

  Trending Stories

  Related Stories