జూన్ 30న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, పబ్లిసిటీ లిటరేచర్ డిపార్ట్మెంట్ కో ఇంచార్జ్ వికాష్ ప్రీతం సిన్హా ఓ ఆసక్తికరమైన డిమాండ్ ను తీసుకొచ్చారు. ముస్లిం మతాధికారులు అరబిక్ బదులు భారతీయ భాషలను మసీదులలో పఠించటానికి కోరారు. అప్పుడే ఇతరులకు కూడా అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. కోట్లాది మంది భారతీయులకు అరబిక్ భాష తెలియదని, అర్థం కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా లక్షలాది మసీదుల నుండి రోజుకు ఐదుసార్లు అజాన్ అరబిక్‌లో పఠించబడుతుందని ఆయన అన్నారు.
“దేశంలోని లక్షలాది మసీదుల నుండి రోజుకు ఐదుసార్లు అజాన్ అరబిక్ భాషలో పఠిస్తూ ఉంటారని.. ఈ దేశంలోని లక్షలాది మంది అరబిక్ తెలియని ప్రజలకు దాని అర్థం తెలియదు. అందువల్ల, ప్రభుత్వం మరియు ముస్లిం మతాధికారులు భారతీయ భాషలలో అజాన్ చెప్పడానికి ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాను, దీంతో ప్రజలకు దాని అర్ధం మరియు ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది” అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

అజాన్ మరియు లౌడ్ స్పీకర్లకు సంబంధించి వివాదాలు:
భారతదేశంలో, చట్టం ప్రకారం, రాత్రిపూట (10:00 PM నుండి 6:00 AM మధ్య) లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉపయోగించకూడదు. శబ్దం స్థాయి 11 డిబి (ఎ) ద్వారా పరిసర శబ్ద ప్రమాణాలను మించరాదని చట్టం చెబుతోంది. శబ్ద కాలుష్యం కారణంగా మత ప్రదేశాలలో లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని పరిమితం చేయాలని అధికారులకు పలు కోర్టుల నుండి ఆదేశాలు వచ్చాయి.