More

  హిందువుల చరిత్రకు ముసుగేసిన కాంగ్రెస్..!
  కర్నాటక హైకోర్టు తీర్పుతో గుట్టు రట్టు..!!

  తాజాగా.. కర్నాటక హైకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు తీసుకున్న ఓ పనికిమాలిన నిర్ణయాన్ని సరిచేసింది. చిక్‎మగళూర్‎లోని బాబా బుడాన్‎గిరి పర్వత గుహలో వున్న దత్తపీఠంలో.. వెంటనే హిందూ పూజారిని నియమించాల్సిందిగా కర్నాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. హిందూ పురోహితులను కాదని, దత్తపీఠం బాధ్యతలను ముస్లిం పూజారులకు అప్పగించడాన్ని తప్పుబడుతూ.. జస్టిస్ పి.ఎస్. దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. చిక్‎మగళూర్‎లోని దత్తపీఠం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ హిందూ పూజారులే దత్తపీఠం బాధ్యతలు చూస్తున్నారు. అయితే, ఇందుకు భిన్నంగా.. 2018లో నాటి సిద్ధరామయ్య ప్రభుత్వం.. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తుంగలోకి తొక్కింది. ఎండోమెంట్ కమిషనర్ నివేదిక, సిఫార్సులను పట్టించుకోకుండా.. సంప్రదాయానికి విరుద్ధంగా.. దత్తాత్రేయ పీఠానికి ఓ మౌల్వీని పూజారిగా నియమించింది. ఈ పనికిమాలిన నిర్ణయంపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హిందువుల పుణ్యక్షేత్రంలో ముస్లిం మౌల్వీని ఎలా నియమిస్తారంటూ జాతీయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  దత్తాత్రేయ స్వామిని హిందువులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా భావిస్తారు. మహా పతివ్రత అనసూయ, అత్రి మహర్షిల పుత్రుడే దత్తాత్రేయుడు. త్రిమూర్తులు పెట్టిన శీల పరీక్షలో నెగ్గిన సతి అనసూయకు.. త్రిమూర్తులు తమ అంశతో కుమారుడుని అనుగ్రహిస్తారు. ఇది హిందూ పురాణాలు చెబుతున్న సత్యం. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో వంద సంవత్సరాలుగా అన్యమతస్తులు తిష్టవేశారు. దత్తపీఠం వున్న ప్రదేశాన్ని ముస్లింలు దాదా హయత్ మీర్ క్వాలందర్ ప్రదేశంగా చెప్పుకుంటారు. శ్రీ గురుదత్తాత్రేయ బాబా బుడాన్ స్వామి దర్గాగా పేర్కొంటారు. 150 సంవత్సరాల క్రితం బాబా బుడాన్ ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని, అతనే యెమెన్ నుండి భారతదేశానికి మొదటిసారిగా కాఫీ విత్తనాలను తెచ్చారని అంటూవుంటారు. ఈ ప్రచారం కారణంగా స్థలపురాణం పక్కకుపోయింది. దత్తాత్రేయ పీఠం చరిత్ర మసకబారే పరిస్థితి దాపురించింది. ప్రతియేటా డిసెంబర్ మాసంలో వచ్చే దత్తాత్రేయ జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతీసారి అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ఇలా చాలా రోజులుగా దత్తపీఠంపై వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ వివాదం కోర్టుకు కూడా వెళ్లింది.

  ఈ నేపథ్యంలో 2010లో నాటి యడ్యూరప్ప ప్రభుత్వం నిజాల్ని నిగ్గుతేల్చి న్యాయపరంగా రుజువు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కర్నాటక ఎండోమెంట్ శాఖ నివేదికను రూపొందించింది. అదే ఏడాది మార్చి 10న ఎండోమెంట్ కమిషనర్ ఆ రిపోర్టును సుప్రీం కోర్టుకు కూడా సమర్పించారు. దత్తపీఠం నిర్మహణ కమిటీ ద్వారా హిందూ పూజారిని నియమించాలని నివేదికలో సూచించారు. అయితే, ప్రతి అంశంలోనూ తన మార్కు రాజకీయాలను ప్రదర్శించే కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే మైనార్టీ ఓట్ల కక్కుర్తిని ప్రదర్శించింది. సిద్ధరామయ్య సర్కార్ దత్తపీఠం బాధ్యతలను ముస్లిం పూజారికి కట్టబెట్టింది. తద్వారా చరిత్రహీనమైన చర్యకు పాల్పండింది.

  ఇదిలావుంటే తాజా తీర్పుతో హిందువులకు ఊరట లభించింది. బాబ్రీ ఆఫ్ సౌత్‎గా పిలుచుకునే దత్తపీఠం బాధ్యతలు స్వాధీనం చేసుకునేందుకు హిందువులు చేసిన న్యాయపోరాటం ఫలించింది. తీర్పు సందర్భంగా.. రామజన్మభూమి దేవాలయం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాన్ని కూడా కర్నాటక హైకోర్టు ప్రస్తావించింది. విశ్వాసం అనేది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం. ఆ విశ్వాసం నిజమని చెప్పే ఆధారాలున్నప్పుడు దానినే అమలుపరచాలని సూటిగా చెప్పింది. అయితే, హైకోర్టు తాజా తీర్పుతో ఖంగు తిన్న ముస్లిం వర్గం.. మళ్లీ న్యాయస్థానం మెట్లెక్కేందుకు సిద్ధమవుతోంది. కోర్టు ఆర్డర్ ను సవాలు చేస్తూ.. పీఠం వారసత్వ నిర్వాహకుడు సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ షా ఖాద్రీ నేతృత్వంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నాడట.

  దత్తపీఠం ఒక్కటే కాదు.. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలకు ఎన్నో హిందూ ఆలయాలు.. హిందువుల నియంత్రణ నుంచి దూరమయ్యాయి. అలాంటి మరో దేవాలయం మహాబలేశ్వర్ మందిరం. సిద్ధరాయమ్య నేతృత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, గత బీజేపీ ప్రభుత్వం డినోటిఫై చేసిన మందిరాలపై కన్నేసింది. 2008లో నాటి యడ్యూరప్ప ప్రభుత్వం మహాబలేశ్వర్ మందిరంపై ప్రభుత్వం నియంత్రణను తొలగించి.. ఆ బాధ్యతలను రామచంద్రపుర మఠానికి అప్పగించింది. అయితే, 2013లో జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాసుల కక్కుర్తిని ప్రదర్శించింది. మందిరాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చింది. ఇందుకోసం, మందిరంపై బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగిందని.. అందువల్ల కుల వివక్ష పెరిగిందనే సాకులు చెప్పింది. అయితే, ఈ ఏడాది ఏప్రిలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహాబలేశ్వర్ మందిర నిర్వహణ బాధ్యతలను సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీకి అప్పగించింది.

  అయినా, మైనార్టీల మద్దతుకోసం చరిత్రను తప్పుగా చిత్రీకరించడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్నెతో పెట్టిన విద్య. నాడు మలబార్ హిందువులను ఊచకోతకు గురిచేసిన మోప్లా మారణహోమాన్ని ప్రేరేపించడం,.. తర్వాత చరిత్రను మార్చి చూపించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసే ముసుగులో.. నాడు స్వాతంత్ర్యోద్యమంతో ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా ముడిపెట్టి నడిపించాడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. చివరికి అదే ఉద్యమం 10 వేల మంది హిందువుల ఊచకోతకు దారితీసింది. ఇంతజరిగినా, మోప్లా ఉద్యమ తీవ్రతను, హిందూ వ్యతిరేక స్వభావాన్ని తగ్గించేందుకు గాంధీజీ ప్రయత్నించినట్టు చరిత్రకారులు చెబుతారు. మోప్లా మతోన్మాదానికి అసలు కారణాలు కనుగొనాలని.. కారణాలు లేకుండా నిందించడం సరికాదని వాదించారని అంటారు.

  బ్రిటిష్ పాలనలో భారత్ రెండు రైతు ఉద్యమాలను చవిచూసింది. ఒకటి మలబార్ తిరుగుబాటు.. దీన్నే మోప్లా ఉద్యమం అంటారు. మరొకటి బెంగాల్‎లో జరిగిన టిటుమిర్ ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలకు నాయకులు ముస్లింలే. ఇవి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల ముసుగులో నడిచిన.. హిందువుల వ్యతిరేక ఉద్యమాలు అని చెప్పొచ్చు. మోప్లా ఉద్యమంలో వేల మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ వీటిని ఎప్పుడూ మతపరమైన దాడులుగా గుర్తించలేదు. కానీ, నేడు జరుగుతున్న రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి మాత్రం మతం రంగు పులుముతోంది. ఆరెస్సెస్ తన మతపరమైన అజెండాను ప్రచారం చేయడం కోసం రైతు ఉద్యమాలను కించపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని.. కాంగ్రెస్ మౌత్‎పీస్ నేషనల్ హెరాల్డ్ ఇటీవల కథనాలు రాసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మైనార్టీల మెప్పుకోసం హిందువుల మందిరాలపై పడి ఏడుస్తూవుంటాయి. చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను తుంగలోకి తొక్కి.. వాటి నిర్వహణ బాధ్యతను అవసరమైతే ముస్లింలకు కూడా అప్పగిస్తాయి. తద్వారా మతపరమైన ఘర్షణలకు బాటలు వేస్తాయి. ఒకవేళ ఇలాంటి కుట్రలను అడ్డుకుంటే మాత్రం.. ‘హిందూ టెర్రరిజమ్’ అంటూ కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడతుంటారు.

  హిందూ టెర్రరిజమ్ వల్లనే 26 బై 11 ముంబయి దాడులు జరిగాయని ప్రచారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. ముంబయి దాడుల తర్వాత.. ‘26 బై 11 ఆరెస్సెస్‎కి సాజిష్’ పేరుతో అజిజ్ బర్నీ అనే ఓ దేశద్రోహి పుస్తకం రాస్తే.. దానిని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించాడు. అదే వేదికపై ఆరెస్సెస్‎పై ఆరోపణలు గుప్పించారు. ఆ దాడులను ఆరెస్సెస్‎కు అంటగట్టే ప్రయత్నం చేశాడు. దీంతో 26 బై 11 దాడుల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం వుందన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఇందుకు బలం చేకూర్చుతూ.. ఘటనా స్థలంలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి.

  ఆనాడు దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల వద్ద హిందూ ఐడెంటిటీ కార్డులు దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన అనేక ఆధారాలను ముంబై మాజీ పోలీస్ అధికారి రాకేశ్ మరియా తన ‘లెట్ మి సే ఇట్ నౌ’ పుస్తకంలో వివరించారు. ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ పట్టుబడినప్పుడు.. అతని వద్ద బెంగళూరుకు చెందిన ‘సమీర్ దినేష్ చౌదరి’గా గుర్తింపు కార్డు దొరికిందని.. చేతికి రక్షాకంకణాలు కూడా కట్టి వున్నాయని తెలిపారు. ఓ పాకిస్తానీ టెర్రరిస్టు వద్ద హిందూ ఐడెంటిటీ దొరకడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత 26 బై 11 ఘటనను ఆరెస్సెస్ కు అంటగడుతూ పుస్తకం రాయడం.. దానిని సీనియర్ కాంగ్రెస్ నేత చేతుల మీదుగా ఆవిష్కరించడం చూస్తుంటే.. ఇది కావాలని చేసిన కుట్ర అనే అనుమానాలున్నాయి. అంటే, ఒకవేళ కసబ్ గనుక ప్రాణాలతో చిక్కకుంటే.. ముంబయి దాడులు ఆరెస్సెస్ పనేనని దిగ్విజయ్ సింగ్ నమ్మించేవాడేమో..! అదే జరిగితే, 26 బై 11 ఘటనను హిందూ టెర్రర్ యాక్టివిటీగా చిత్రీకరించేవాళ్లన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి.

  ఇప్పడేమో మొఘల్స్, బ్రిటిషర్ల తరహాలో.. హిందువుల మందిరాలను రూపుమార్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కర్నాటక ఉందంతాలే ఇందుకు నిదర్శనం. అయితే, ప్రస్తుతం అధికారంలో వున్న బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం వీటిపై ఓ కన్నేసి ఉంచింది. ఇటీవలే, మందిరాల ఆదాయాన్ని హిందూయేతర ప్రయోజనాల కోసం వాడకుండా నిషేధం విధించింది. అటు మందిరాలపై హిందూయేతర శక్తుల ఆజమాయిషీకి నిర్ద్వందంగా చెక్ పెడుతోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చేష్టలపై ప్రతి హిందువూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.

  Trending Stories

  Related Stories