తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ముస్లిం నేతకు ముస్లిం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మైనారిటీ నాయకుడు మహ్మద్ అన్వర్ స్థానిక మసీదు కోసం కూలర్‌లను విరాళంగా ఇచ్చాడు. అయితే ఆగ్రహించిన ప్రజలు కూలర్‌లన్నింటినీ ఎత్తుకుని బయటకు విసిరారు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బావంతరం తాలూకా తొరుమామిడిలో చోటుచేసుకుంది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన మైనారిటీ నాయకుడు మహ్మద్ అన్వర్ పెరుగుతున్న వేడి కారణంగా మసీదుకు కూలర్లను విరాళంగా ఇచ్చారు. కూలర్లను విరాళంగా అందజేస్తూ, ”ముస్లింల కోసం బీజేపీ ఎంతో చేసింది. బీజేపీకి ముస్లింలంటే చాలా ఇష్టం. నిజానికి ముస్లింలను బీజేపీకి కాంగ్రెస్ దూరం చేసింది.” అని వివరించి చెప్పారు. అయినా కూడా వినకుండా కొందరు కూలర్లను విసిరి పడేశారు.
మహ్మద్ అన్వర్ బీజేపీ ముస్లింలకు చేసిన మంచిని మరింత ప్రశంసించారు. “ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం ద్వారా బీజేపీ ముస్లిం మహిళల కోసం చాలా మంచి పని చేసింది. ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు, ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ముస్లింలను ఉపయోగించుకుంది.” అని అన్వర్ అన్నారు.
బీజేపీ నేతపై వికారాబాద్ ముస్లిం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు మసీదులో అతను విరాళంగా ఇచ్చిన కూలర్‌లను ఎత్తుకుని బయటకు విసిరారు, అన్ని కూలర్‌లను సేకరించి అతని ఇంటి ముందు విసిరారు. బీజేపీకి మద్దతిచ్చినందుకు ముస్లిం సమాజం ఆ సామాజిక వర్గానికి చెందిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు, జై శ్రీరామ్ అని నినాదాలు చేసినందుకు ముస్లింలను ఇతర ముస్లింలు కొట్టిన అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది.