రోడ్డు మీద నమాజ్ చేయనివ్వనందుకు నిరసనలు.. యూపీ పోలీసులు రాగానే

0
707

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పూర్‌లోని మసీదు ముందు పెద్ద సంఖ్యలో ముస్లింలు గుమికూడారు. రోడ్ల మీదకు వచ్చి అల్లాహు అక్బర్, ఇతర నినాదాలు చేశారు. జామా మసీదులో అల్విదా జుమ్మా (రంజాన్ సందర్భంగా చివరి శుక్రవారం) ప్రార్థనల తర్వాత, రోడ్లపై నమాజ్ చేయకూడదనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు వీధుల్లో నిరసనలు తెలిపారు. అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యోగి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకం ప్రకారం, సహరాన్‌పూర్‌లోని జామా మసీదు కమిటీ అల్విదా జుమా కోసం బహిరంగ ప్రదేశాలను ఉపయోగించవద్దని ఆ ప్రాంతంలోని ముస్లింలను విజ్ఞప్తి చేసింది. ఒక బహిరంగ లేఖలో.. జిల్లాలోని అన్ని మసీదులలో ముస్లింలను వారి స్థానిక మసీదులలో నమాజ్ చేయాలని.. రోడ్లు, మార్కెట్లు, ట్రాఫిక్ కూడళ్లలో ఎటువంటి నమాజ్ చేయకూడదని కోరారు.

నిబంధనల ప్రకారం అల్విదా జుమ్మా ప్రార్థనలు జామా మసీదు లోపల చేశారు. అయితే కొందరు ముస్లిం యువకులు నమాజ్ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్డును పూర్తిగా దిగ్బంధించి అరగంటకు పైగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పలు పోలీస్ స్టేషన్ల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ట్రాఫిక్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రంగంలోకి దించారు. డీఎం అఖిలేష్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముస్లిం యువకులను శాంతింపజేసేందుకు వారితో మాట్లాడారు. పోలీసులతో మాట్లాడిన తర్వాత నిరసనకారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.