More

    బురఖా వేసుకున్న మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడని.. హిందూ వ్యక్తిపై దాడి

    బుర్ఖా వేసుకున్న మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడని హిందూ వ్యక్తిపై దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. తేదీ ఎప్పుడో క్లారిటీ లేకపోయినా ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ ముస్లిం మహిళ హిందూ వ్యక్తితో వెళుతుండగా ఓ గ్రూపు వారిని అడ్డుకుంది.. ఆ తర్వాత ఆ యువతిని తిట్టడం దగ్గర నుండి.. మరో ఆటోలో ఎక్కించే వరకూ జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టడం కూడా చూడొచ్చు. ట్విట్టర్‌లో హేట్ పెట్రోల్ స్క్వాడ్ అనే అకౌంట్ షేర్ చేసిన వీడియోలో, గుంపులోని వ్యక్తులు హిందూ వ్యక్తిని బెదిరించడం, ముస్లిం మహిళను బురఖాతో ఇలా వెళ్లకూడదని తిట్టడం కూడా చేశారు. ముస్లిం మహిళ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని.. ఇలా ఎలా పంపిస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. హిందూ పురుషుడితో ప్రయాణించినందుకు ఆమెను తిట్టి.. ఆటో ఎక్కించి పంపించి వేశారు.

    ముస్లిం మహిళను ఎక్కించుకోడానికి ఎంత ధైర్యం.. ఇంకోసారి అలా చేశావంటే నీ అంతు చూస్తా అని బెదిరించాడు ఓ వ్యక్తి. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అంటూ బూతులు తిట్టడమే కాకుండా కొట్టడం కూడా మొదలు పెట్టాడు. బెదిరించిన ముస్లిం వ్యక్తి బైక్ మీద ఉన్న వ్యక్తిని కొట్టడం మొదలు పెట్టాడు. తామిద్దరం ఒకేకంపెనీలో పనిచేస్తున్నాం.. లిఫ్ట్ ఇస్తున్నాడని ఆ యువతి చెప్పినా కూడా వాళ్లు వినలేదు. ముస్లిం యువతితో మాట్లాడుతూ ఆమెను కూడా బూతులు తిట్టి.. తన్నాడు కూడానూ..! బురఖా వేసుకుని ఇలాంటి పనులు చేయకండి.. బురఖా లేకుండా ఏమైనా చేసుకోండి అంటూ ఆ మహిళను బైక్ దిగమని చెప్పాడు. ఇంకా మీ కుటుంబ సభ్యులకు కాల్ చేయమని కూడా కోరాడు.

    https://twitter.com/HatePatroller/status/1439300953967038466

    “హిందూ వ్యక్తితో ప్రయాణించడం మీకు సిగ్గు లేదా? ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు తెలియదా? వీళ్లతో బయటకు వెళ్లవద్దని మేము మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము, కానీ ఇప్పటికీ బైక్‌పై కూర్చుని అతనితో ప్రయాణిస్తున్నావు. మేము మీ గురించి ఆందోళన చెందము. మేము బురఖా గురించి ఆందోళన చెందుతున్నాము. బురఖా ధరించిన ఒక మహిళ ఇలా రైడ్ చేయడం చూసి ప్రజలు ఏమి అనుకుంటారు” అని ఆ వ్యక్తి అరవడం మొదలు పెట్టాడు. ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. “నువ్వు అతనితో ప్రయాణించాల్సిన అవసరం ఏమిటి? మీ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ ఇవ్వు ” అని అడుగుతూ బైక్‌పై ఉన్న హిందూ వ్యక్తిని ముస్లిం వ్యక్తులు మళ్లీ కొట్టారు. బైక్ నుండి దిగమని మహిళను కోరారు. మీకు సమస్య ఏమిటి అని ఆమె అతడిని అడిగింది.. కానీ ఆ వ్యక్తులు నీ భర్త నంబర్ ఇవ్వమని అడిగారు. ఆ వ్యక్తి మహిళ ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసి, తన భార్యను వేరే వ్యక్తితో ప్రయాణించడానికి అనుమతించినందుకు ఆమె భర్తను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. “మీలాంటి నపుంసకుల కారణంగా, మొత్తం సమాజం అపహాస్యానికి గురవుతోంది. మీ చర్యల పట్ల మీకు సిగ్గు లేదా? వారి ఉద్దేశాలు మీకు తెలియదా? నాతో వాదించవద్దు. ” అంటూ ఆ వ్యక్తులు బాధితురాలి భర్తతో మాట్లాడారు. అతను ఆ మహిళను ఆటోలో ప్రయాణించమని బలవంతం చేసి, “మీ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మేము బురఖా గురించి ఆందోళన చెందుతున్నాము” అని వ్యాఖ్యలు చేశాడు. ఆమెను ఆటోలో ఎక్కించి మరీ పంపించి వేశారు.

    సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. మహిళతో పాటు ప్రయాణిస్తున్న బైక్ రైడర్‌పై దాడి చేసిన కేసులో బెంగళూరు సిటీ పోలీసులు వేగంగా వ్యవహరించారని ఆయన అన్నారు. కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని ఆయన ట్వీట్ చేశారు.

    తెలంగాణలో కూడా అలాంటి ఘటనలు:

    ఇటీవల తెలంగాణాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. హిందూ వ్యక్తులతో బైక్ పై వెళుతున్న ముస్లిం మహిళలను కొందరు వ్యక్తులు నిలిపివేసిన అనేక సంఘటనలు నివేదించబడ్డాయి. వారు బహిరంగంగా తిట్టడమే కాకుండా, హిందూ వ్యక్తులను కూడా దారుణంగా కొట్టారు. ఒక హిందూ దళిత వ్యక్తి ముస్లిం మహిళతో వెళ్ళినప్పుడు ముస్లిం పురుషుల బృందం కిడ్నాప్ చేసి, కొట్టారు. స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో తరువాత విడుదలయ్యాడు. భయపడ్డ ఆ వ్యక్తి కేసు పెట్టడానికి ధైర్యం కూడగట్టడానికి అతనికి రెండు రోజులు పట్టింది. అతని సోదరుడు, స్థానిక నాయకులు అతనికి మద్దతు ఇచ్చిన తర్వాత మాత్రమే అతడిని కిడ్నాప్ చేసిన ముస్లిం పురుషులపై కేసు నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories