ఫేస్ బుక్ లోని ‘హా హా’ రియాక్షన్ హరామ్ అట.. ఫత్వా జారీ చేశారు..!

0
751

ఫేస్ బుక్ లో ఏదైనా ఒక పోస్టు పెడితే.. వాటికి మనం లైక్, లవ్, కేర్, హా హా, శాడ్, వావ్, కోపం లాంటి వాటిని మన రెస్పాన్స్ గా చెప్పొచ్చు. అయితే ఇందులోని ‘హా హా’ అన్నది హరామ్ అని చెబుతున్నారు ఓ ముస్లిం మతాధికారి. బంగ్లాదేశ్‌లోని ఒక ప్రముఖ ముస్లిం మతాధికారి ఇస్లాంలో హా హా అనడం “పూర్తిగా హరామ్” అని చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్‌లోని పోస్ట్‌లపై స్పందించడానికి ఉపయోగపడే ‘హా హా’ ఎమోజీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసినట్లు మీడియా సంస్థలు చెప్పాయి. ఫేస్ బుక్, యూట్యూబ్లలో మూడు మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న అహ్మదుల్లా అనే మతాధికారి ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రజలను అపహాస్యం చేయడానికి ఫేస్బుక్లో హా హా రియాక్షన్ ను ఉపయోగించడాన్ని హెచ్చరించారు. అలాంటి ఈమోజీని అసలు వాడకూడదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రజలను అపహాస్యం చేయడానికి ఫేస్బుక్ యొక్క హా హా ఎమోజిలను ఉపయోగించకూడదు. హాహా ఎమోజీలతో పూర్తిగా సరదాగా వ్యవహరించవచ్చు. కంటెంట్ను పోస్ట్ చేసిన వ్యక్తి అదే ఉద్దేశించినట్లయితే ఇది మంచిది. కానీ మీ స్పందన పోస్ట్ చేసిన వ్యక్తులను ఎగతాళి చేయాలనుకోవడం తప్పు. సోషల్ మీడియాలో ఏవైనా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా హా హా అంటూ స్పందించడం ఇస్లాంలో పూర్తిగా నిషేధం.. హరామ్ తో సమానం అని అహ్మదుల్లా అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులకే పలువురు హా హా రియాక్షన్ ఇచ్చారు. ఒకరిని అపహాస్యం చేయటానికి హా హా స్పందించవద్దని తన అనుచరులను కోరారు. అయితే అహ్మదుల్లా పోస్ట్‌పై వందలాది మంది ఫేస్‌బుక్ వినియోగదారులు హా హా అంటూ స్పందించారు.

ఇటీవల ఇరాన్ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ కార్టూన్లు, యానిమేటెడ్ ఫీచర్లలోని మహిళలను హిజాబ్ ధరించి చిత్రీకరించాలని పేర్కొంటూ ఒక ఫత్వా జారీ చేశారు. భారతదేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సెమినరీలలో ఒకటైన ఉత్తర ప్రదేశ్ లోని సహారన్పూర్ లోని దారుల్ ఉలూమ్ డియోబంద్ కూడా ముస్లింలను సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేయకుండా నిషేధించే ఫత్వా జారీ చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here