హిందూ పెళ్లిలో ‘అల్లా స్తుతి’..!

0
784

హిందూ వివాహమంటే మంగళవాయిద్యం, వేదమంత్రం…. హిందూ వివాహమంటే జీలకర్ర బెల్లం, మంగళసూత్రం…. హిందూ వివాహమంటే అగ్నిహోత్రం, అరుంధతి నక్షత్రం…. హిందూ వివాహమంటే ఏడు అడుగులు, మూడు ముళ్లు…. మొత్తంగా… హిందూ వివాహమంటే సనాతన సంప్రదాయం…. హైందవ ధర్మబద్ధంగా రెండు మనసులు ఏకమయ్యే పవిత్ర కార్యం. అలాంటి పవిత్ర హిందూవివాహంలో అన్యమతానికి చెందిన పాటలు వినిపిస్తే మీకేమనిపిస్తుంది..? చిర్రెత్తుకొస్తుందా..? రాదా..? ఆ వివాహవేడుకలోనూ అదే జరిగింది. ఓవైపు హైందవ సంప్రదాయ బద్ధంగా విహహం జరుగుతుంటే.. ‘అల్లా హో అక్బర్’ పాట వినిపించింది. ఆహూతులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఖర్చుపెట్టి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుంటే.. ఇలా అన్యమత పాటను ఆలపించి అందరినీ షాక్ చేసింది ఆ మ్యూజికల్ ట్రూప్.

ఇక, ఆ పాట చెవినపడగానే.. అక్కడే వున్న ఓ పెద్దాయన మనస్సు చివుక్కుమంది. పవిత్ర వివాహవేడుకలో ఇదేం గోలరా బాబూ అనుకుంటూ.. ఆ మ్యూజిక్ ట్రూప్ హెడ్ ను వారించాడు. ‘బాబూ.. హిందూ పెళ్లిలో అల్లా పాటలేంటయ్యా’ అంటూ మందలించాడు. ఆ మాత్రానికే సదరు మ్యూజిషియన్‎కు ‘సెక్యులరిజం’ గుర్తుకొచ్చింది. కళాకారుడికి మతమేంటంటూ.. ఓ మాసిపోయిన డైలాగ్ తో నిట్టూర్చాడు. నిజమే, కళాకారుడికి మతం ఉండకపోవచ్చు. కానీ, దానికి ఓ పరిధి అంటూ వుంది కదా..! ఎక్కడ ఏం పాడాలో అన్న ఇంగితం ఉండాలి కదా..! ఇష్టమొచ్చిన పాటలు పడటానికి.. అదేమైనా పబ్లిక్ మీటింగా..? సనాతన హైందవ సంప్రదాయంలో జరుగుతున్న హిందూ వివాహ వేడుక. అక్కడ అన్యమత పాటలు పాడమేంటి..?

ఇంత జరిగిన తర్వాత కూడా.. అరె.. నేను చేసింది తప్పే కదా..! అని తన తప్పు గ్రహించడం మానేసి.. సిగ్గులేకుండా సమర్థించుకున్నాడు ఆ మ్యుజిషియన్. ఆ ప్రబుద్ధుడి పేరు అభిషేక్ శంకర్. ఇక, తనకు ఘోర అవమానం జరిగిందన్న రేంజిలో.. తన ఇన్‎స్టాగ్రామ్‎ను ఓ చాట భారతంతో నింపేశాడు. తనను వారించిన పెద్దమనిషిపై అక్కసు వెళ్లగక్కాడు. ఈ సంఘటన తనను బాధించిందని వాపోయాడు. అప్పట్లో గోద్రా అల్లర్ల సమయంలో.. మునవర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడీయన్ కామెడీ షోలు రద్దయ్యాయి. ఈ ఘటనను.. ఆ ఘటనతో పోల్చుకుంటూ.. సరిగ్గా తనకు కూడా అలాగే జరిగిందని ఇన్‎స్టాలో పోస్ట్ పెట్టాడు.

అభిషేక్ తన ఏడుపుగొట్టు ఇన్‎స్టా పోస్టులో ఇంకా ఏం రాశాడో చూద్దాం. హాస్యనటులు మాత్రమే విద్వేష బాధితులు కాదని.. సంగీత కళాకారులు కూడా అంటూ వెటకారం వెళ్లగక్కాడు. తాము అన్ని మతాలకు సంబంధించిన పాటలు పాడతామని.. తన ట్రూప్ లో సూఫీ సంగీతం కూడా వినిపిస్తామన్నాడు. తాము నూరన్ సిస్టర్స్ పాటలతో పాటు.. నుస్రన్ ఫతే ఆలీఖాన్ పాటలు కూడా గొప్పలకు పోయాడు. ఈ పెళ్లివేడుకలో జరిగిన ఘటనను వర్ణిస్తూ.. తమ ట్రూప్‎లోని లేడీ సింగర్ ‘అల్లా హో’ అంటూ సూఫీ పాట మొదలు పెట్టేవరకు అంతా బాగానేవుందని.. కానీ, పెళ్లిలో ఓ పెద్దాయన అభ్యంతరం చెప్పడంతో ఆపేశామని తెలిపాడు. ‘అల్లా పాటలేంటి..? మేం ముస్లింల్లాగా కనిపిస్తున్నామా..? అంటూ ఆ పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేశాడని రాసుకొచ్చాడు. అంతేకాదు, ఆ పాటను ఆపకపోతే, బయటికి విసిరేస్తాని అన్నాడని ఆరోపించాడు అభిషేక్. ఈ సంఘటనతో తాము ఇబ్బంది పడ్డామని.. ఆ తర్వాత ప్రదర్శన కొనసాగించాలని అనిపించలేదని తెలిపాడు.

ఆ ఘటన తర్వాత ఓ హిందువుగా అతను సిగ్గుపడ్డాడట. ఒంటిపై గాయత్రిని ధరించినందుకు కూడా అసహ్యం కలిగిందట. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని.. మతపరమైన విద్వేషాన్ని రాజకీయ, సామాజిక వేదికలకే పరిమితం చేయాలని.. కళాకారులకు ఆపాదించొద్దని చిలకపలుకులు పలికాడు అభిషేక్ శంకర్.

అసలు అభిషేక్ శంకర్ ఇంతగా ఆందోళన చెందడానికి కారణమేంటో నాకైతే అర్థం కాలేదు. పవిత్రమైన హిందూ వివాహ వేడుకలో అన్యమత పాటలు పాడింది కాకుండా.. దానిని సమర్థించుకోవడం.. దానికి సెక్యులర్ ముసుగు తొడగడం ఆయనకే చెల్లింది. కళాకారులకు మతం ఉండదట..! నిజమే, కానీ అది ఎంతవరకు..? కళాకారులు.. ఒకరి మత సంప్రదాయాల్లో మరో మత సంప్రదాయాన్ని చొప్పించడం కరెక్టేనా..? ఏదిపడితే అది పాడటానికి అదేమైనా పబ్లిక్ మీటింగా..? హిందు సంప్రదాయం ప్రకారం జరుగుతున్న వివాహ వేడుక. అలాంటి పవిత్ర వేడుకలో అల్లా పాటలు పాడి అపవిత్రం చేసింది కాకుండా.. సెక్యులర్ ముసుగులో సమర్థించుకోవడానికి సిగ్గుండాలి.. అంటూ సోషల్ మీడియాలో అభిషేక్‎పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. హిందూయేతర మత వేడుకల్లో హిందువుల పాటలు పాడే దమ్ముందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏం హిందువులంటే అంత చులకనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, అభిషేక్ శంకర్ ఘనకార్యాన్ని మొదట ‘ద్వి క్వింట్’ వెబ్‎సైట్‎ వెలుగులోకి తెచ్చింది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆర్టికల్ వెబ్‎సైట్ నుంచి అదృశ్యమైంది. ఈ కథనాన్ని చూసి అభిషేక్ శంకర్‎పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. సదరు సెక్యులర్ సంగీత విధ్వాంసుడు పలయానం చిత్తగించాడు. అయితే, ‘ది క్వింట్’ ఆర్టికల్‎ను ఎందుకు తొలగించిందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. కుహనా సెక్యులర్ వాదిని వెనుకేసుకురావడానికేనా..? లేక మరేదైనా కారణమా..? అనేది ఆ సంస్థ యాజమాన్యానికే తెలియాలి. కానీ, అదే ఆర్టికల్ apdirect.in అనే వెబ్‎సైట్‎లో కూడా ప్రచురితం కావడంతో.. అభిషేక్ శంకర్‎పై విమర్శల వెల్లువ కొనసాగుతూనేవుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here