ఒకే ఊరిలో ఉంటున్న హిందూ యువకుడు, ముస్లీం యువతి ప్రేమించుకున్నారు. మతాలు వేరే అయినా ఇద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నారు. పెద్దలను ఎదిరించి అయినా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. ప్రేమికుల విషయం ప్రియురాలి కుటుంబ సభ్యులకు తెలిసింది.
రాజకీయంగా పలుకుబడి ఉన్న ప్రియురాలి కుటుంబ సభ్యులు మొదట పంచాయితీలు చేసి ప్రియుడికి, అతని తల్లికి వార్నింగ్ ఇచ్చారు. మా అమ్మాయి జోలికి వస్తే మీ కొడుకు అంతు చూస్తామని ఇప్పటికే ప్రియుడి తల్లిని బెదిరించారు. అయితే ప్రేమికులు మాత్రం పెద్దల బెదిరింపులకు తలవంచలేదు. ప్రియుడు ఏమాత్రం లెక్కచెయ్యడం లేదని ప్రియురాలి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ఇదే సమయంలో ప్రియుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రియుడిని హత్య చేసిన రోజే ప్రియురాలి కుటుంబ సభ్యులు వీడిని కచ్చితంగా చంపేస్తాము అంటూ మొబైల్ లో స్టేటస్ పెట్టడం కలకలం రేపింది.
కర్ణాటకలోని కలబురిగిలో విజయేంద్ర అలియాస్ అలియాస్ విజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విజయ్ నివాసం ఉంటున్న ఏరియాలోనే రజియా అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ఊరిలో ఉంటున్న హిందూ యువకుడు విజయ్, ముస్లీం యువతి రజియా ప్రేమించుకున్నారు. మతాలు వేరే అయినా విజయ్, రజియా కొన్ని సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నారు. పెద్దలను ఎదిరించి అయినా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు విజయ్, రజియా డిసైడ్ అయ్యారు. ప్రేమికుల విషయం ప్రియురాలు రజియా కుటుంబ సభ్యులకు తెలిసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న ప్రియురాలి రజియా కుటుంబ సభ్యులు మొదట పంచాయితీలు చేసి ఆమె ప్రియుడు విజయ్ కి, అతని తల్లికి వార్నింగ్ ఇచ్చారు.
మా అమ్మాయి జోలికి వస్తే మీ కొడుకు విజయ్ అంతు చూస్తామని ఇప్పటికే ప్రియుడి తల్లిని కొందరు యువకులు బెదిరించారు. అయితే ప్రేమికులు విజయ్, రజియా మాత్రం ప్రియురాలి పెద్దల బెదిరింపులకు తలవంచలేదు. ప్రియుడు విజయ్ ఏమాత్రం లెక్కచెయ్యడం లేదని ప్రియురాలి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ఇదే సమయంలో ఇంటికి వెలుతున్న ప్రియుడు విజయ్ ను కొందరు వ్యక్తులు దారుణ హత్య చెయ్యడంతో అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. విజయ్ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు గురైన యువకుడు విజయ్ ముస్లీం అమ్మాయిని ప్రేమిస్తుండటంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు మరోరకంగా తిరిగాయి. ఇదే సమయంలో అందరూ హడలిపోయి విషయం బయటకు వచ్చింది. ముస్లీం అమ్మాయి ప్రియుడు విజయ్ ని హత్య చేసిన రోజే ప్రియురాలి కుటుంబ సభ్యులు విజయ్ ని కచ్చితంగా చంపేస్తాము అంటూ మొబైల్ లో స్టేటస్ పెట్టడం కలకలం రేపింది.
రంగంలోకి దిగిన పోలీసులు విజయ్ హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. విజయ్ ను చాలా మంది కలిసి చంపేశారని, పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని, హంతకులు అందరిని అరెస్టు చెయ్యాలని విజయ్ కుటుంబ సభ్యులు, కొన్ని హిందూ సంఘాలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. విజయ్ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.