More

  మునుగోడు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ఇంత పెద్ద ప్లాన్ వేశారా..?

  మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారీగా ప్లాన్ చేస్తోంది. దసరా మరుసటి రోజు నుంచి పార్టీ యంత్రాంగమంతా మునుగోడులోనే మోహరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను జారీ చేశారు.

  86 యూనిట్లుగా మునుగోడు:
  మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్నిక ప్రచారసరళిని పర్యవేక్షించే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగించారు. ఒక్కో యూనిట్ లో ఎమ్మెల్యే కింద 20 మంది నేతలు ప్రచారంలో పాల్గొంటారు. దసరా మరుసటి రోజు నుంచి ఎన్నిక జరిగేంత వరకు ఇన్ఛార్జీలంతా మునుగోడులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

  Trending Stories

  Related Stories