మునుగోడు బై పోల్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఉపఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గవ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు 3వేల 366 మంది పోలీస్ సిబ్బందితో పాటు 15కంపెనీల కేంద్ర బలగాలను మొహరించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 41వేల 855 మంది ఉన్నారు. అలాగే 5వేల 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తంగా 50 టీమ్స్ ఉన్నాయి. 199 మైక్రో అబ్జర్వర్స్ అందుబాటులో ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈసీ భద్రతా చర్యలను పటిష్టం చేసింది. అయితే మునుగోడులో ఓటరు నాడి ఎటువైపు ఉందో తేలాలంటే మరికొద్ది గంటల సమయ వేచి చూడాల్సిందే.