నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. నామినేషన్ల విత్‌డ్రాకు గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యను అధికారులు ప్రకటించారు. ఉప ఎన్నికకు మొత్తం 130మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో స్క్రూటీని ప్రక్రియలో 47మంది అభ్యర్థులను తిరస్కరించగా, 83 మంది అభ్యర్థుల నామినేషన్లను ఓకే చేశారు. తాజాగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఉప ఎన్నిక తుది పోరులో 47మంది అభ్యర్థులు నిలిచారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక బరి నుంచి అనుహ్యంగా 36మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడం గమనార్హం.