More

    మునుగోడులో లక్షమంది కాళ్లు మొక్కడం కాంగ్రెస్ కు కలిసొస్తుందా..?

    తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కీలకం అవ్వనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ సత్తాను నిరూపించుకోవాలని అనుకుంటూ ఉన్నాయి. ఇక ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ వినూత్న రీతిలో మునుగోడులో పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి లక్షమంది కాళ్లు మొక్కి ఓట్లు అడగాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి అభిమానులు వెయ్యిమంది రంగంలోకి దిగుతున్నారు. వీరందరితో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఓ వైపు పార్టీ నేతలు ప్రచారంలో బిజీగా ఉంటే.. రేవంత్‌ బృందం ఓటర్ల కాళ్లు మొక్కేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

    మునుగోడు నియోజక వర్గంలో ‘మన మునుగోడు, మన కాంగ్రెస్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించాయి. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు – మన కాంగ్రెస్‌ కరపత్రాలను ప్రతి బూత్‌లో అంటించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ నేతలు పిలుపునిచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories