More

    మునుగోడు ఉపఎన్నిక: 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్

    మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి. 2 గంటల్లో 20 శాతం పోలింగ్ పెరిగింది. పోలింగ్ సరళి మధ్యాహ్నం నుంచి పుంజుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గట్టుప్పల్ మండలం రంగంతండాలో గ్రామస్తులు ఎన్నికను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేయమని గ్రామస్తులు తెలిపారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం, చర్లగూడెం గ్రామంలో భూ నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఓటింగ్కు దూరంగా ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. క్యూలో నిలబడలేక కొందరు మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాల ముందే సేద తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంస్ధాన్ నారాయణపురం మండలం అల్లందేవి చేరువులో కూడా పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ కూడా ఈవీఎంలు మొరాయించాయి. మనుగోడు నియోజకవర్గంలోని కొండాపూర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పోలింగ్ ఆగిపోయింది. దీంతో భారీ సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.

    Trending Stories

    Related Stories