అట్టుడికిన లాహోర్.. మార్కెట్ లో భారీ విస్ఫోటం..!

పాకిస్తాన్ లోని లాహోర్ ఈరోజు అట్టుడికింది. లాహోర్ లోని మార్కెట్ లో భారీగా సంభవించింది. పాకిస్తాన్ లాహోర్‌లోని బర్కత్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం పేలుడు కారణంగా అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. బర్కత్ మార్కెట్లో ఉన్న ఓ షాపులో సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది. ఆ పేలుడు వల్ల సమీపంలో ఉన్న షాపులన్నీ ధ్వంసం అయ్యాయి. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. పది వాహనాలు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది పేలుడు చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ పేలుడుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ భారీ చోటు చేసుకుంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడ్డ, మరణించిన వారి ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియలేదు. గాయపడిన ఒక వ్యక్తిని జిన్నా ఆసుపత్రికి తరలించారని కొందరు పాకిస్తాన్ జర్నలిస్టులు ట్విట్టర్ లో తెలిపారు.
పాకిస్తాన్ ARY మీడియా సంస్థ కథనం ప్రకారం ’10 సిలిండర్లు ఇప్పటివరకు పేలిపోయాయని.. ఒక వ్యక్తికి కాలిన గాయాలు అయ్యాయి ‘ అని తెలిపింది. ఈ సంఘటనలో కనీసం 12 వాహనాలు, చాలా దుకాణాలు దెబ్బతిన్నాయని తెలిపారు. బర్కత్ మార్కెట్లోని గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.