More

    ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

    సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో, యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8.30 గంటలకు మరణించారు. 82 ఏళ్ల వయసున్న ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వతేదీన ఆసుపత్రిలో చేరారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ములాయంసింగ్ యాదవ్. ‘‘నా గౌరవ తండ్రి, ప్రతి ఒక్కరి నేత ఇక లేరు’’అంటూ ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పై సందేశాన్ని హిందీలో పోస్ట్ చేశారు.

    1939 నవంబర్ 22వతేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు. ములాయం1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ములాయంసింగ్‌ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్.రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌యాదవ్ లోహియా. కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ ఈయన పనిచేశారు. ములాయం మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు.

    Trending Stories

    Related Stories