ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

0
904

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 82 ఏళ్ల ములాయం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ములాయం గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉన్నారని.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.

82 ఏళ్ల SP అధినేత ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతాజీ గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ‘క్రిటికల్ కేర్ యూనిట్’లో చికిత్స పొందుతున్నారని సమాజ్ వాదీ పార్టీ తెలిపింది. ఆయన్ను కలిసేందుకు ఆసుపత్రికి రావద్దంటూ కోరింది. ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.